Rashmi Gautam: ఓంకార్ షోలో కన్నీరు పెట్టుకున్న ర‌ష్మీ గౌత‌మ్.. ఎందుకో తెలుసా?

Rashmi Gautam: బుల్లితెర పాపుల‌ర్ యాంక‌రీమ‌ణుల‌లో ర‌ష్మీ గౌత‌మ్ ఒక‌రు. ఈ అమ్మ‌డు జ‌బ‌ర్ధ‌స్త్ షోతో లైమ్ లైట్‌లోకి రాగా ఆ త‌ర్వాత ఢీషోతో మ‌రింత పాపులారిటీ తెచ్చుకుంది. అడ‌పాద‌డ‌పా సినిమాల‌లో న‌టిస్తూ హీరోయిన్‌గా కూడా అల‌రించింది. ప్ర‌స్తుతం ర‌ష్మీకి ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంద‌నే చెప్పాలి. అందుకు కార‌ణం ఆమె ప్రొఫెష‌న్ ఒక్క‌టే కాదు సామాజిక సేవ కూడా. లాక్‌డౌన్ స‌మ‌యంలో నిరుపేద‌ల‌కు త‌న వంతు సాయం చేసిన ర‌ష్మీ గౌత‌మ్ మూగజీవాల‌ని కూడా చేర‌దీసింది.

rashmi gautam
rashmi gautam

ర‌ష్మీ ఏ విష‌యాన్నైన స్ట్రైట్‌గా ముక్కుసూటిగా చెబుతుంది. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు కొంద‌రు నెటిజ‌న్స్‌కి లెఫ్ట్ అండ్ రైట్ క్లాసులు పీకుతూ ఉంటుంది. త‌ప్పు చేసిన వారి త‌ప్ప‌క దండించే ర‌ష్మీ తాజాగా పిల్ల‌ల విష‌యంలో ఎమోష‌న‌ల్ అవుతూ ప‌లు కామెంట్స్ చేసింది. ఈ లోకంలో చాలా మంది బిడ్డ‌లు త‌ల్లి దండ్రుల ప్రేమ దొర‌క్క ఇబ్బందులు ప‌డుతున్నారు.

ప్రేమ‌, పెళ్లి అంటూ కోరిక‌లు తీర్చుకొని పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత విడిపోతున్నారు. ఈ క్ర‌మంలో పిల్ల‌లు వేలెత్తి చూపించే లోకంలో వేగలేక రాజీ జీవితానికి అలవాటుపడుతున్నారు. ఇలాంటి ఇక్కట్లు ఈసడింపుల్ని తట్టుకుని గెలిచి నిలిచిన యాంకర్ రష్మి తన గతాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యింది. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ‘సిక్స్త్ సెన్స్’ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన రష్మి త‌న ఆట పాట‌ల‌తో తెగ సంద‌డి చేసింది.

వ‌ర్షిణితో క‌లిసి మాస్ మ‌సాలా డ్యాన్స్‌లు చేసిన ర‌ష్మీ తెగ సంద‌డి చేసింది. అప్ప‌టి వ‌ర‌కు చాలా సంద‌డిగా సాగిన షోలో ఒక్క‌సారిగా నిశ్శ‌బ్ధం ఏర్ప‌డింది. తన పేరెంట్స్ ప్రస్తావన వచ్చేసరికి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ సందర్భంగా పిల్లల్ని కనేవారికి చేతులెత్తి దండం పెడుతూ రిక్వెస్ట్ చేసింది. మై మదర్ సింగిల్ మదర్.. పుట్టడం అనేది పిల్లల ఛాయిస్ కాదు.. చాలామంది పిల్లలు ఎవరికి పుట్టాలన్నది వారి ఛాయిస్ కాదు.

ఎక్కడ పుట్టాలి.. ఎవరికి పుట్టాలన్నది వాళ్ల ఛాయిస్ కాదు. బంధాలు.. బంధుత్వాలు.. సమస్యలకు పిల్లలు బాధ్యులు కాదు. పెళ్లి కావచ్చు.. రిలేషన్ షిప్ కావచ్చు.. మీకు మీ రిలేషన్ షిప్ మీద నమ్మకం లేకపోతే దయచేసి.. ఆ పుట్టబోయే పిల్లల మీద బాధ్యతలు పెట్టి ఈ ప్రపంచంలోకి తీసుకుని రాకండి’ అని చేతులెత్తి మొక్కి కన్నీటిపర్యంతం అయ్యింది యాంకర్ రష్మి.

ర‌ష్మీ త‌ల్లిదండ్రులు ప‌లు విభేదాల‌తో విడిపోగా, ర‌ష్మి విశాఖపట్నంలోని తాతయ్య, అమ్మమ్మల దగ్గరే పెరిగింది. హైద‌రాబాద్‌కి వ‌చ్చిన ఆమె స్వ‌శ‌క్తితో ఎదిగి ఈ స్థాయికి చేరుకుంది. రష్మి తల్లి ఒరిస్సాలోని వర్హంపూర్‌కి చెందినది కాగా, తండ్రి ఉత్తరప్రదేశ్ వాసి.