Rashmi: కన్నీరు పెట్టుకున్న రష్మీ.. బతకడం వేరు, కోరిక తీర్చుకోవడం వేరని కామెంట్
Samsthi 2210 - July 6, 2021 / 10:44 AM IST

Rashmi: జబర్ధస్త్ కార్యక్రమంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. ఈ అమ్మడికి సామాజిక దృక్పథం చాలా ఎక్కువ. ముఖ్యంగా మూగ జీవాల విషయంలో ఈ అమ్మడు రెస్పాన్స్ అయ్యే తీరు అందరిచే ప్రశంసలు కురిపిస్తుంది . మూగజీవాల పట్ల, ప్రకృతి పట్ల ఈ అమ్మడు తరచు రెస్పాన్స్ అవుతుంటుంది.
జంతువులకు, మూగ జీవాలకు హాని కలిగించే ప్రతీ మతంలోని ఆచార వ్యవహారాలను ఆమె వేలెత్తి చూపుతుంటారు. అయితే రష్మీ వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు అనే తేడా లేకుండా అన్నింటి గురించి ఆలోచిస్తుంటారు. ఏ వీధి కుక్క అయినా కూడా ఆపదలో ఉందని తెలిస్తే రక్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. వాటిపై జరిగే దాడిని ఎప్పటికప్పుడు ఖండిస్తుంటారు.
ఇటీవల ఓ బీచ్‌లో బ్రూనో అనే కుక్కని ముగ్గురు కలిసి అతి కిరాతకంగా చంపేశారు. కర్రలతో బాది, ఆపై దాన్ని చేపలను గాలానికి వేలాడిదీసినట్టు వేలాడదీసి చంపేశారు. ఈ భయంకర ఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది, రష్మీని కూడా చాలా బాధించింది. అదేం పాపం చేసిందని దాన్ని అలా చంపారు.. అంటూ రష్మీ వాపోయారు.
తాజాగా రష్మీ ఓ వీడియోను చూసి ఎమోషనల్ అయ్యారు. పిల్లలు ఉదయాన్నే లేచినప్పుడు తల్లిదండ్రులు పక్కన లేకపోతే వారు ఎంత ఆవేదన చెందుతారో తెలిసిందే. పిల్లలకి తమ పేరెంట్స్ కనిపిస్తే ఆ ఆనందమే వేరు. రష్మీ షేర్ చేసిన వీడియోలో ఓ జలచరం తన తల్లి కనిపించకపోయే సరికి వెదుకులాట ప్రారంభించింది. చివరకు తన తల్లి కనిపించే సరికి దాని దగ్గరకు వెళ్లి ముద్దులాడింది.
తల్లిని చూసిన జీవి చాలా సంతోషంగా ఉందని, దానిని చూసి ఏడుపు వచ్చిందని రష్మీ చెప్పుకొచ్చింది. మనకు మాదిరిగానే వాటికి కూడా ఫీలింగ్ ఉంటాయి. బతికేందుకు వాటిని చంపి తినడం వేరు, రుచులు, కోరికలు తీర్చుకునేందుకు ఎదుటివాటిని చంపి తినడం వేరు. మంచిగా బతుకుదాం.. ఎదుటి వాటిని బతకనిద్దాం అని రష్మీ చెప్పుకొచ్చారు. రష్మీ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఎంతగానో కదిలిస్తున్నాయి.