Rashmi: ర‌ష్మీ గౌతమ్ ఎంత క్యూట్‌గా క‌నిపిస్తుంది.. అమ్మ‌డిని చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

Rashmi: యాంకర్‌గా బుల్లి తెర ప్రేక్షకులను తన చలాకీ తనంలో ఆకట్టుకునే రష్మీ.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్‌ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ అమ్మడు తాజాగా ఎల్లో క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసింది. ఈ అమ్మ‌డి క్యూట్ లుక్ చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.

rashmi beautiful pics8
rashmi beautiful pics8

రష్మీ పబ్లిక్,ప్రైవేట్ ఈవెంట్స్ లో పాల్గొంటే చాలు, చూడడానికి జనాలు ఎగబడిపోతారు. ఆమెతో ఫోటో దిగడానికి సాహసాలు చేస్తారు. ఫ్యాన్స్ అభిమానం అప్పుడప్పుడు ఆమెకు తలనొప్పులు కూడా తెచ్చిపెడుతుంది.

rashmi beautiful pics
rashmi beautiful pics

ఆ మధ్య ఓ బట్టల షాప్ ఓపెనింగ్ కి వెళ్లగా, కుర్రాళ్ళు ఆమెను చూడడానికి పోటీపడ్డారు. సరైన భద్రత, సెక్యూరిటీ కూడా లేకపోవడంతో జనాల మధ్య రష్మీ నలిగిపోయారు.

rashmi beautiful pics67jpg
rashmi beautiful pics67jpg

రష్మీ క్రేజ్ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేస్తుందని అందరూ భావించారు. అయితే బుల్లితెర కలిసొచ్చినంతగా ఆమెకు వెండితెర కలిసి రావడం లేదు. హీరోయిన్ గా పలు ఆఫర్స్ దక్కినా, హిట్ అనేది దక్కలేదు. దీనితో ఆమెకు చిన్నగా అక్కడ ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.

rashmi beautiful pics6
rashmi beautiful pics6

ప్రస్తుతం రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల కావాల్సి ఉంది. నందు హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మీ గౌతమ్ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి కాగా, చాలా కాలంగా ఈ చిత్రం బాక్సులకే పరిమితం చేస్తున్నారు.

rashmi beautiful pics5
rashmi beautiful pics5

రెండు దశాబ్దాలుగా గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న రష్మీ, ఎవరో ఒకరిపై మనసు పారేసుకోకుండా ఉండడం జరగని పని. అయితే ఆ బంధాన్ని రష్మీ అసలు బయటకు పొక్కనివ్వలేదు.

rashmi beautiful pics4
rashmi beautiful pics4

రష్మీ ప్రస్తుత ఫోకస్ మొత్తం కెరీర్ పైనే. టెలివిజన్ యాంకర్ ఆమె ఫుల్ బిజీ . ఢీ షో, జబర్దస్త్ లో ఆమె యాంకర్ గా ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలు అత్యధిక టీఆర్పీ కలిగిన షోలుగా ఉన్నాయి.