Rashmi And Nandu : యాంకర్ రష్మీపై నోరు పారేసుకున్న నందూ.! అసలేమైంది వీళ్లిద్దరికీ.!
NQ Staff - October 18, 2022 / 08:11 PM IST

Rashmi And Nandu : ఫోన్ చేస్తుంటే ఎత్తవ్. ప్రమోషన్లకు రావు.. అంటూ యాంకర్ రష్మీపై నందూ ఫైర్ అయ్యాడు. అక్కడితో ఆగలేదు. రష్మీ షూటింగ్ చేస్తున్న ప్లేస్‌కి వెళ్లి ఆమె పరువు తీసేలా మాట్లాడాదు. దాంతో రష్మీ కూడా నందూపై రివర్స్అయ్యింది.
నువ్వు ఫోన్ చేస్తే నేనెందుకు రావాలి.? నేను రాను.. ఈ ప్రెజర్ నేను తీసుకోలేను.. అని మొహం మీద కొట్టినట్లుగా సమాధానం చెప్పింది రష్మీ గౌతమ్. అసలింతకీ ఏంటి వీళ్లిద్దరి మధ్యా రగడ.? అనుకుంటున్నారా.?
ఇదో ప్రాంక్ వీడియో. వీళ్లిద్దరూ కలిసి ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. టైటిల్ వింటే ఎక్కడో విన్నట్లుంది కదా. అవునండీ, ఎప్పుడో రావల్సిన సినిమా ఇది. రెండేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ, ఇంతవరకూ రిలీజ్‌కి నోచుకోలేదు.
‘బిబి’ కోసం రష్మీ – నందూ ఇంత చేశారా.?
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు మేకర్లు. దాంతో, హీరో, హీరోయిన్లు ప్రమోషన్ల కోసం ఇదిగో ఇలా రంగంలోకి దూకారన్న మాట. గతంలో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టైమ్‌లోనూ నందూ ఇలాగే చేశాడు. ‘బిబి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. దాంతో నందూ బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడంటూ ప్రచారం జరిగింది.
కట్ చేస్తూ, తను నటిస్తున్న సినిమా పేరు ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అని చావు కబురు చల్లగా సెలవిచ్చాడు. అప్పట్లోనే ఈ సినిమాకి సంబంధించి ప్రచార చిత్రాలు హల్‌చల్ చేశాయ్. ఇప్పుడయితే, జనం ఈ సినిమా గురించి పూర్తిగా మర్చిపోయారు. అందుకే, రష్మీ, నందూ తమదైన శైలిలో ఫ్రాంక్ వీడియో చేసి, ప్రేక్షకుల దృష్టిని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ 4న ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.