Rashi Khanna: కాబోయే వ‌రుడి కోసం రాశీ ఖ‌న్నా గాలింపు.. క్వాలిటీస్ వింటే షాక్ అవ్వాల్సిందే..!

Rashi Khanna: అందం, అభిన‌యం ఉన్న చక్క‌ని న‌టి రాశీ ఖ‌న్నా. ఈ అమ్మ‌డు చిన్నప్పుడు బాగా చదివేదట, అంతే కాక ఆ రోజుల్లో ఆమె టాపర్ గా కూడా ఉండేదట. చిన్నప్పుడు ఆమెకు సింగర్ కావాలనే కోరిక బలంగా ఉండేదని, కొంత వయసు వచ్చాక చదువు మీద ఆసక్తి కలిగి ఒక ఐ ఏ ఎస్ ఆఫీసర్ కావాలని కలలు కనింద‌ని ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చింది. విధి వ‌ల‌న న‌టిని అయ్యాన‌ని అంటున్న రాశీ ఖ‌న్నా మద్రాస్ కేఫ్ సినిమాతో నటిగా మారింది.

Rashi Khanna about her life partner
Rashi Khanna about her life partner

ఊహలు గుసగుసలాడే, జోరు, జిల్, శివమ్ , బెంగాల్ టైగర్, సుప్రీమ్ , హైపర్ , జై లవ కుశ, రాజా ది గ్రేట్ , సినిమాలతో తెలుగులో సత్తా చాటగా, విలన్ సినిమాతో మలయాళ ఎంట్రీ కూడా ఇచ్చింది. తర్వాత తెలుగులో మరికొన్ని సినిమాలు చేయగా తమిళ డెబ్యూ ఆఫర్ కూడా లభించింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ తో పాటు హాట్ ఫోటోలు కూడా తన అభిమానులతో పంచుకుంటూ రచ్చ రేపుతోంది.


ఈ మధ్య నాజూకుగా మారి, తన లేలేత అందాలను బహిర్గతం చేస్తూ హాట్ హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.ఎప్పుడు ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలిచే రాశీ ఖ‌న్నా తాజాగా త‌నకి కాబోయే వరుడు ఎలా ఉండాలో చెబుతూ అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.


తనకు కాబోయే భర్త పెద్ద అందగాడు కాకపోయినా ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడై ఉండాలని, దేవుడిపై నమ్మ‌కం, భ‌క్తి భావ‌న ఉండాల‌ని చెప్పింది.సుగుణాలు ఉన్న వ్యక్తిని వ‌రుడిగా ఎంచుకుంటానుంటున్న రాశీ అత‌ని కోసం వెతుకుతుంద‌ట‌. అంద‌రి క్వాలిటీస్ క‌న్నా రాశీ క్వాలిటీస్ కాస్త డిఫ‌రెంట్‌గా ఉండ‌డంతో అంద‌రు అవాక్క‌వుతున్నారు. ప్ర‌స్తుతం రాశీ ఖ‌న్నాతొమ్మిది సినిమాల‌తో బిజీగాఉంది.


తుగ్లక్ దర్బార్, అరణ్మనై , భ్రమమ్, పక్కా కమర్షియల్, థాంక్యూ , సర్దార్, తిరుచిత్రం బలం, మేథవి, సైతాన్ కా బచ్చా సినిమాల్లో రాశీఖన్నా నటిస్తోంది. ఈ సినిమాల‌తో మంచి క్రేజ్ అంది పుచ్చుకోవాలని ప్ర‌య‌త్నిస్తుంది.