KRACK: క్రాక్ రీమేక్‌.. లైన్‌లోకి మ‌రో హీరో..!

డాను శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌- గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం క్రాక్. మాస్ రాజాలో ఉన్న మాస్ ఎలిమెంట్స్‌ని పూర్తిగా బ‌య‌ట‌పెట్టించిన ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపించ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. రొటీన్ కథను ఎక్కడా బోర్ కొట్టించకుండా నెక్స్ట్ ఏమౌతుంది అన్న రీతిలో కథ పక్కదారి పట్టకుండా గ్రిప్పింగ్‌గా ముందుకు నడిపించారు. సినిమా పాత్ర‌ధారుల ఎంపిక కూడా సినిమాకు చాలా ప్ల‌స్ అయింద‌నే చెప్పాలి. సీరియర్ నటుడు సముద్రఖని క‌టారి కృష్ణ పాత్ర‌లో అద్భుతంగా న‌టించి అల‌రించారు.

కటారి కృష్ణ సెటప్‌గా జయమ్మ పాత్రలో అదరగొట్టింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ పాత్ర‌లో ఆమె పూర్తిగా ఒదిగిపోయి న‌టించింది. కె.జి విష్ణు సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యింది. రవితేజను పోలీస్ ఆఫీసర్‌గా చూపించ‌డంతో పాటు ప్ర‌తి ఫ్రేంను అద్భుతంగా చూపించారు. థ‌మ‌న్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స‌క్సెస్‌లో స‌గ‌భాగం అయ్యాయి. చాలా రోజుల త‌ర్వాత ర‌వితేజ మంచి హిట్ కొట్ట‌గా, ఈ సినిమాని ఇత‌ర భాష‌ల‌లో రీమేక్ చేసేందుకు నిర్మాత‌లు చేసుకుంటున్నారు.

బాలీవుడ్‌లో క్రాక్ చిత్రం రీమేక్ కానుంద‌ని ఇందులో సీనియ‌ర్ అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ర‌ణ్‌వీర్ సింగ్ ఫ్రేంలోకి వ‌చ్చాడు. అజ‌య్ దేవ‌గ‌ణ్ చేతిలో ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిని పూర్తి చేసే స‌రికి చాలా టైం ప‌డుతుంది. ఈ క్ర‌మంలో క్రాక్ రీమేక్ చేయ‌డం ఇప్పుడు క‌ష్ట‌మే అని భావించిన అత‌ను నిర్మాత‌ల‌కు నో చెప్పాడ‌ట‌. దీంతో సెకండ్ ఆప్ష‌న్‌గా ర‌ణ్‌వీర్ సింగ్‌తో క్రాక్ రీమేక్ చేయించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ర‌ణ్‌వీర్ సింగ్ న‌టించిన క‌పిల్ దేవ్ బ‌యోపిక్ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ప్ర‌స్తుతం ఓ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు ఈ బాలీవుడ్ హీరో.

Advertisement