Mythri movies : మైత్రీ మూవీస్‌లో రంగస్థలం కాంబో..!

Mythri movies : మైత్రీ మూవీస్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థ. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి అన్నీ పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో వరసగా సినిమాలు చేస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థలో అల్లు అర్జున్ పుష్ప.. మహేష్ బాబు సర్కారు వారి పాట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్‌ల కాంబోలో నిర్మించబోయే సినిమా.. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబోలో సినిమా, ఎన్.టి.ఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో నిర్మించే సినిమా, బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబో తో పాటు మరికొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు ప్రొడక్షన్స్‌లో ఉన్నాయి.

rangastalam-combo-in-mytri-movies
rangastalam-combo-in-mytri-movies

కాగా మరోసారి మైత్రీ వారు మరోసారి రంగస్థలం కాంబోలో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. సుకుమార్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్‌లో రంగస్థలం వచ్చి సెన్షేషనల్ హిట్ అందుకుంది. మైత్రీ వారు నిర్మించిన ఈ సినిమాతో భారీ లాభాలను అందుకున్నారు. అయితే వచ్చే ఏడాది మరోసారి సుకుమార్రాం చరణ్ కాంబినేషన్‌లో అద్భుతమైన కథతో భారీ బడ్జెట్ సినిమా నిర్మించనున్నారట. పుష్ప తెరకెక్కిస్తున్న సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే అంటున్నారు. అయితే సుకుమార్ .. విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయాల్సి ఉంది. మరి రంగస్థలం కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

Mytri movies : మరోసారి ఉప్పెన కాంబోలో కొత్త ప్రాజెక్ట్ మొదలవబోతోంది.

సుకుమార్ – మైత్రీ వారు కలిసి మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీస్ కలిసి నిర్మించిన ఉప్పెన సినిమా రీసెంట్‌గా వచ్చి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. మరోసారి ఉప్పెన కాంబోలో కొత్త ప్రాజెక్ట్ మొదలవబోతోంది. ఈ ప్రాజెక్ట్‌తో సుకుమార్ శిష్యుడు దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నాడు. డెబ్యూ సినిమాతో వైష్ణవ్ తేజ్ – కృతిశెట్టి ఎంతటి పాపులారిటీని తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. మరోసారి ఈ కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పడం కష్టం.

Advertisement