SS Rajamouli : రాజమౌళికి ఆ నటుడంటే అంత కోపమా.. అందుకే ఛాన్సులు ఇవ్వలేదా..?
NQ Staff - February 17, 2023 / 04:30 PM IST

SS Rajamouli : రాజమౌళి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తీసే సినిమాలో చిన్న రోల్ దొరికినా చాలు అని చాలామంది అనుకుంటున్నారు. రాజమౌళి కూడా ఎంతో మందికి ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆయనకు గతంలో ఓ డైరెక్టర్ తో గొడవ జరిగింది. ఆయన ఎవరో కాదు రంగనాథ్. రంగనాథ్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అప్పట్లో రాజమౌళి ఈటీవీలో వచ్చే శాంతినివాసం సీరియల్ ను డైరెక్ట్ చేశాడు. ఇది అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఇందులో ఇంటిపెద్ద పాత్రలో నటించాడు రంగనాథ్. కాగా ఈ సీరియల్ ను కూడా సినిమా స్టైల్ లో తీశాడు రాజమౌళి. దాంతో రంగనాథ్ తో రాజమౌళికి తరచూ ఏదో ఒక గొడవ జరిగేది.
ఆయనతో దూరం..
ఈ సీన్ ఇలా ఎందుకు, అలా ఎందుకు అంటూ రంగనాథ్ రాజమౌళితో గొడవకు దిగేవాడంట. కానీ రాజమౌళి మాత్రం అవేమీ పట్టించు కోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లేవాడు. ఆ సమయంలో రాజమౌళి రంగనాథ్ కు కొంత దూరం పాటిస్తూ వచ్చేవాడు. తర్వాత కాలంలో రాజమౌళి పెద్ద డైరెక్టర్ అయిపోయాడు.
తన సినిమాలో శాంతినివాసం సీరియల్ లో నటించిన వారందరికీ ఛాన్సులు ఇచ్చాడు. కానీ ఒక్క రంగనాథ్‌కు మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనతో ఉన్న గొడవలే కారణం అని చెబుతూ ఉండేవారు. రాజమౌళి సాధారణంగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోరు. కానీ రంగనాథ్ తో గొడవలు ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.