Rana: రానా తండ్రి నిర్ణ‌యానికి ఇండ‌స్ట్రీ షాక్..అంతా దీనిపైనే చ‌ర్చ‌

Rana OTTలో సినిమాలు విడుదల చేస్తే కచ్చితంగా థియేటర్లకు నష్టం వాటిల్లుతుంది.. నిర్మాతలకు కూడా అది శ్రేయస్కరం కాదు అని ఒకప్పుడు రానా తండ్రి, ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు చెప్పారు. కానీ ఇప్పుడు అదే నిర్మాత బిజినెస్ పరంగా చూసుకుంటే.. సినిమాను ఎక్కడైనా విడుదల చేసుకునే హక్కు ఉంది చెబుతున్నాడు.

ఈ క్రమంలోనే సురేష్ ప్రొడక్షన్స్ లోని మరో రెండు సినిమాలు నేరుగా డిజిటల్ ప్లాట్ ఫాం లో విడుదల కాబోతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వెంకటేష్ నారప్ప సినిమా జూలై 20న అమెజాన్ ప్రైమ్ విడుదల చేస్తున్నారు. దీనికి దాదాపు 37 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ వెంకటేష్ సినిమా థియేటర్ లో విడుదలై విజయం సాధించిన కూడా ఇంత మొత్తం వసూలు చేయడం కష్టమే.

మంచి ఆఫర్ వచ్చిందని నేరుగా విడుదల చేస్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్. మరోవైపు ఇదే బ్యానర్ నుంచి వస్తున్న దృశ్యం 2, విరాట పర్వం సినిమాలు కూడా ఓటీటీ రిలీజ్ కావడం దాదాపు ఖాయమైపోయింది. కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దృశ్యం సీక్వెల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. జీతు జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మొదటి భాగంలో నటించిన నటీనటులు అందరు కనిపిస్తున్నారు. 36 కోట్లకు దృశ్యం 2 హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ అమ్మినట్లు తెలుస్తోంది.

మరోవైపు రానా దగ్గుబాటి, వేణు ఉడుగుల కాంబినేషన్లో వస్తున్న విరాట పర్వం సినిమాను నెట్ ఫ్లిక్స్ మంచి రేటు ఇచ్చి డీల్ క్లోజ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఒకే సమయంలో సురేష్ ప్రొడక్షన్స్ నుంచి మూడు సినిమాలు థియేటర్లు కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయడం మాత్రం ఒక రకంగా సంచలనమే. ఇదేగాని జరిగితే మిగిలిన నిర్మాతలు కూడా అటువైపు అడుగులు వేయడం లాంఛనమే అవుతుంది.