Rana: అత్త‌గారి బ‌ర్త్ డే వేడుక‌లో సంద‌డి చేసిన రానా

Rana మొన్న‌టి వ‌ర‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న రానా గ‌త ఏడాది ఆగ‌స్ట్ 8న త‌న ప్రేయ‌సి మిహికా బ‌జాజ్‌ని పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా ఉదృతంగా ఉన్న నేప‌థ్యంలో వారి పెళ్లిని చాలా సింపుల్‌గా జ‌రిపించారు. కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు హాజ‌ర‌య్యారు. అయితే గ‌త ఏడాది మే 12న భళ్లాల దేవ రానా దగ్గుబాటి మిహికా ద‌గ్గ‌ర పెళ్లి ప్ర‌స్తావ‌న తెచ్చాడ‌ట‌.

Rana Daggubati

ఈ ఏడాది మే 12కి స‌రిగ్గా ఏడాది అయిందంటూ మిహికా ఇటీవ‌ల ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. “అతను అడిగాడు నేను ఓకే అన్నా. నా జీవితంలో తీసుకున్న అత్యుత్తుమ నిర్ణయం ఇదే. ఇది జరిగి సంవత్సరం అయిందంటే నమ్మలేకపోతున్నాను. ఏదేమైనా అడిగినందుకు ధన్యవాదాలు. ఐ లవ్‌ యూ రానా” అని మిహికా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

Rana & Miheeka

పెళ్లి తర్వాత మిహికతో ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తూనే సినిమాల జోష్ పెంచారు దగ్గుబాటి రానా. ప్ర‌స్తుతం విరాట పర్వం తో పాటు అయ్య‌ప్ప‌నుమ్ కోషియమ్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల‌న చిత్ర షూటింగ్స్‌కు బ్రేక్ ప‌డింది. కొద్ది రోజులుగా ఇంటికే ప‌రిమిత‌మైన రానా త‌న అత్త బ‌ర్త్ డే సంద‌ర్భంగా వారి ఇంటికి వెళ్లాడు. బంటీ బ‌జాజ్( అత్త‌) బ‌ర్త్ డే వేడుక‌ల‌లో పాల్గొని సంద‌డి చేశాడు.

అల్లుడు రాకతో బంటీ బజాజ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘నా పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా చేసిన నా కుటుంబానికి కృతజ్ఞతలు’’ అని ఈ ఫొటోను ఆమె పోస్ట్‌ చేశారు. నెట్టింట ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. కాగా, రానా న‌టించిన విరాట ప‌ర్వం చిత్రం ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా, క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించ‌నుండ‌గా, కీల‌క పాత్ర‌లో ప్రియ‌మ‌ణి క‌నిపించ‌నుంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి రానా న‌టిస్తున్న రీమేక్ చిత్రం స‌గ‌భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. లాక్‌డౌన్ త‌ర్వాత‌ తిరిగి చిత్ర షూటింగ్ మొద‌లు కానుండ‌గా, రానా టీంతో జాయిన్ కానున్నాడు. ఇందులో రానా పాత్ర ప్రేక్ష‌కుల‌కి సరికొత్త వినోదాన్ని అందిస్తుంద‌ని అంటున్నారు.