Rana Daggubati : కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిజమే.. ఆ సమస్య కూడా ఉంది.. ఓపెన్ అయిన రానా..!
NQ Staff - March 17, 2023 / 11:10 AM IST

Rana Daggubati : టాలీవుడ్ భళ్లాల దేవుడిగా పేరు తెచ్చుకున్న రానా అందరికీ సుపరిచితమే. ఆయన ఆరడుల అందగాడిగా చాలామంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చి వెంకటేశ్ తర్వాత మంచి పేరు సంపాదించుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
అయితే గతంలో రానాకు అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వాటిపై స్పందించాడు రానా. ప్రస్తుతం ఆయన బాబాయ్ వెంకటేశ్ తో కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఆయన ది బాంబే జర్నీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు.
కుడికన్ను సమస్య..
నాకు గతంలో అనారోగ్య సమస్యలు వచ్చిన విషయం నిజమే. కార్నియల్ మరియు కిడ్నీ అనే రెండు ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు జరిగాయి. నాకు చిన్నప్పటి నుంచి కుడికన్ను సరిగ్గా కనపడదు. అందుకే కుడికన్నుకు ఆపరేషన్ చేశారు. దాంతో పాటు బీపీ కూడా ఉండేది. దాంతో గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చాయి.
ఆ క్రమంలోనే పెద్దయ్యాక కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా రావడంతో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు డాక్టర్లు. అలా ఎన్నో సమస్యలతో బాధపడ్డాను. నాకు ఆపరేషన్ చేసినప్పుడు నా ఫ్యామిలీని చూస్తే బాధేసింది. నేను ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగానే ఉన్నాను. ఇప్పుడు ఏ సమస్య లేదు అంటూ చెప్పుకొచ్చాడు రానా.