Rana Daggubati : నాకు ఆల్కాహాల్ అంటే పిచ్చి.. పిలవకున్నా పార్టీలకు వెళ్తా.. రానా కామెంట్లు..!
NQ Staff - June 1, 2023 / 09:16 PM IST

Rana Daggubati : దగ్గుబాటి రానా సినిమాల్లో హీరోగా, విలన్ గా చేస్తుంటారు గానీ.. రిలయ్ లైఫ్ లో మాత్రం ఆయన చాలా ఫన్నీగా ఉంటారు. ఎలాంటి విలక్షణమైన పాత్రలో నటించేందుకు అయినా సరే రానా రెడీగానే ఉంటారు. కాగా ఆయన రీసెంట్ గా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ తో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు.
శృతిమించిన బోల్డ్ సీన్ల కారణంగా ఆయన తిట్లు తినాల్సి వచ్చింది. అయితే ఇవన్నీ రానా పెద్దగా పట్టించుకోలేదు. ఇక నెక్ట్స్ వచ్చే వెబ్ సిరీస్ లో ఇలాంటివి ఉండవంటూ క్లారిటీ ఇచ్చారు రానా. ఇదిలా ఉండగా తాజాగా ఆయన పరేషాన్ మూవీ ప్రమోషన్స్ కోసం సుమ హోస్ట్ గా చేస్తున్న సుమ అడ్డా ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చారు.
ఇందులో చాలా సరదా సృష్టించారు. మధ్యలో బాహుబలి సినిమా అలాగే 500 నోట్ల ప్రస్తావన వచ్చింది. దాంతో పాటు మందు పార్టీ అనగానే పిలవకున్నా వెళ్లే వారు ఎవరైనా ఉన్నారా అని సుమ ప్రశ్నించింది. వెంటనే రానా స్పందిస్తూ.. హా ఉన్నారు. పార్టీ అనగానే పరుగెత్తుకెళ్లే ఓ పెద్ద బ్యాచ్ ఉంది.
దానికి నేనే హెడ్ అంటూ చెప్పారు. దాంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. అంటే నిజంగానే రానాకు ఆల్కాహాల్ అంటే అంత పిచ్చా అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.