RAMYA KRISHNA: రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న ర‌మ్య‌కృష్ణ‌..!

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు క‌రోనా ధాటికి వ‌ణికిపోతున్నారు. మాస్క్‌లు, వ్యాక్సిన్ మాత్ర‌మే ఇప్పుడు కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తున్నాయి. ఈ క్ర‌మంలో చాలా మంది సెల‌బ్రిటీలు క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అల‌నాటి అందాల తార ర‌మ్య‌కృష్ణ ఇప్పటికే ఫ‌స్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకోగా, ఇప్పుడు రెండో డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకుంది. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన ర‌మ్య‌కృష్ణ ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధరించ‌డం, ఇంట్లోనే ఉండండి, బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు త‌ప్ప‌కు మాస్క్ ధ‌రించ‌డం, వ్యాక్సిన్ కూడా వేసుకోవ‌డం మ‌ర‌వోద్దు అని పేర్కొంది.

ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ణ స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ అల‌రిస్తుంది. బాహుబ‌లిలో శివ‌గామి పాత్ర‌తో మ‌రోసారి త‌న విశ్వ‌రూపం చూపించిన ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు త‌న భ‌ర్త తెర‌కెక్కిస్తున్న రంగ‌మార్తాండ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. 50 ఏళ్ల‌ వయసులో కూడా కుర్ర హీరోయిన్ల‌తో పోటీ పడుతున్న ర‌మ్య సినిమాకు కోటికి పైగా పారితోషికం అందుకుంటూ ఔరా అనిపిస్తుంది వయసుకు తగ్గ పాత్రలు చేస్తూనే.. అప్పుడప్పుడూ సంచలన పాత్రలకు కూడా ఓకే చెప్తుంది ఈ సీనియర్ హీరోయిన్. తాజాగా ఇప్పుడు బోల్డ్ క్యారెక్ట‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.డబుల్ పారితోషికంతో ఈ కారెక్టర్‌కు ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతుంది.. మ‌రి ఇందులో వాస్త‌వ‌మెంతో తెలియాల్సి ఉంది.

Advertisement