Ramya Krishna: ర‌మ్య‌కృష్ణ బ‌ర్త్ డే వేడుక‌లో త్రిష‌,రాధిక‌,ఖుష్బూ ఎంత ర‌చ్చ చేశారో తెలుసా?

Ramya Krishna: ఏ పాత్ర‌లో అయిన ఇట్టే ఇమిడిపోయి పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల న‌టి ర‌మ్య‌కృష్ణ‌. న‌ర‌సింహ చిత్రంలో నీలాంబ‌రిగా, బాహుబ‌లిలో శివ‌గామిగా, దేవ‌త‌పాత్ర‌ల‌లో అచ్చం దేవతా మూర్తిగా న‌టించి మెప్పించింది ర‌మ్య‌కృష్ణ‌. బాహుబలిలో శివ‌గామి పాత్ర ర‌మ్య‌కృష్ణ త‌ప్ప మ‌రెవ‌రు చేయ‌లేరేమో అన్న‌ట్టుగా న‌టించింది.

Ramya Krishnan throws a lavish party on her birthday
Ramya Krishnan throws a lavish party on her birthday

ఒక‌ప్పుడు క‌థానాయిక‌గా స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పించిన ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టిస్తూ మెప్పిస్తుంది. ఈ అమ్మ‌డికి వ‌రుస ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్నాయి. ప్రియురాలిగా.. ప్రతినాయకురాలిగా.. భార్యగా.. తల్లిగా.. భక్తురాలిగా.. అమ్మోరుగా ఇలా విభిన్నమైన పాత్రల్లో తనదైన మార్కు నటనని ప్రదర్శించి నటిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది.
Ramya Krishnan throws a lavish party on her birthday
Ramya Krishnan throws a lavish party on her birthday

ర‌మ్య‌కృష్ణ త‌న 51వ పుట్టిన రోజు వేడుక‌లని ఇటీవ‌ల అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి ఆమె కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు హాజ‌ర‌య్యారు. రాధిక- లిజీ- ఖుష్బూ -మధుబాల- త్రిష- రెజీనాలతో పాటు మరి కొంత మంది నటీనటులు హాజ‌రు కాగా వారితో తెగ సంద‌డి చేసింది.
Ramya Krishnan throws a lavish party on her birthday
Ramya Krishnan throws a lavish party on her birthday

రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగులో సాయి ధ‌ర‌మ్ తేజ్ తో`రిపబ్లిక్`.. కింగ్ నాగార్జునతో `బంగార్రాజు`… విజయ్ దేవరకొండతో `లైగర్` చిత్రాలతో పాటు భర్త కృష్ణవంశీ రూపొందిస్తున్న `రంగ మార్తాండ`లోనూ నటిస్తుంది.