Ramya Krishnan: వ్యాక్సిన్ తీసుకున్న శివ‌గామి.. ఫొటో వైర‌ల్

Ramya Krishnan: రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి చిత్రంలో శివ‌గామిగా న‌టించి ప్ర‌పంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న న‌టి ర‌మ్య‌కృష్ణ‌. చిత్రంలో శివ‌గామి పాత్ర‌కు రమ్య‌కృష్ణ త‌ప్ప ఎవ‌రు న్యాయం చేయ‌లేరేమో అని అనిపించింది. మ‌రి పాత్ర‌లో అంత‌లా ఒదిగిపోయింది. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అల‌రించిన ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు స‌పోర్టింగ్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్ర‌లు పోషిస్తుంది. ప్ర‌స్తుతం త‌న భ‌ర్త తెర‌కెక్కిస్తున్న రంగ‌మార్తాండ చిత్రంలో న‌టిస్తుంది.

VACC
VACC

క‌రోనా బుస‌లు కొడుతున్న స‌మ‌యంలో కేంద్రం సూచన‌ల ప్ర‌కారం పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. 60 ఏళ్లు దాటిన ప్రముఖులతో పాటు కొందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వ్యాక్సిన్ ను తీసుకుంటున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు.త‌న సోష‌ల్ మీడియాపేజ్‌లో వ్యాక్సిన్ తీసుకున్న‌ట్టు పేర్కొన్నారు. మొదటి డోసు తీసుకున్న రమ్యకృష్ణ రెండవ డోసును నిర్ణీత కాల వ్యవధి తర్వాత తీసుకోబోతున్నారు. 50 ఏళ్ల రమ్యకృష్ణ కరోనా వ్యాక్సిన్ ను తీసుకుని అందరికి ఆదర్శంగా నిలిచారు.

Advertisement