అమ్మకానికి పెట్టిన రామోజీ ఫిలిం సిటీ ?

Advertisement

రామోజీ ఫిలిం సిటీ ని అమ్మకానికి పెట్టారు .. తీవ్ర నష్టాల్లోకి వెళ్లడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు … ఇకపైన రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ లు జరగబోవు.. ఇవి సోషల్ మీడియా ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వార్తలు మరి ఇలా వస్తున్న వార్తల్లో నిజం ఎంత ఉంది అనే వివరాల్లోకి వెళ్తే … ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు పెద్ద పెద్ద సంస్థలు సైతం నష్టాల్లో కూరుకుపోయాయి అన్న విషయం తెలిసిందే …. దానిలో ఒకటైన సినీ పరిశ్రమ కూడా పీకల్లోతు నష్టాలొక్కి వెళ్ళిపోయింది ….

ఇక సినిమా షూటింగుల కోసం అద్దెకు ఇచ్చే రామోజీ ఫిలిం సిటీ అన్నపూర్ణ స్టూడియోస్ , రామానాయుడు స్టూడియోస్ మరియు సారధి స్టూడియోస్, వంటి స్టూడియోస్ అన్ని కూడా షూటింగులు లేక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి . ఇది ఇలా ఉండగా తాజాగా రామోజీ ఫిలిం సిటీ అమ్మేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. రామోజీ ఫిల్మ్ సిటీ కి దేశంలోనే అతి పెద్ద స్టూడియోగా పేరుంది. ఈ స్టూడియో విస్తీర్ణం 1666 ఎకరాలు ఉందంటే ఇక ఎంత పెద్ద సంస్థో తెలుస్తుంది … ఫిలిం సిటీ అమ్మేశారు అన్న ప్రచారానికి తెరపడే విధంగా దానిని అమ్మలేదు .. డిస్ని అనే సంస్థకు మూడేళ్లపాటు లీస్ కు మాత్రమే ఇచ్చారని కొంతమంది అంటున్నారు ….

మరికొందరు మాత్రం రామోజీ రావు అన్ని పబ్లిక్ సంస్థల తో దగ్గరి సంబంధం ఉండడం వలన … కరోనా సంక్షోభంతో అన్ని కూడా నష్టాల్లోకి పోయాయని అటువంటి సందర్భం లో ఈనాడు, ఈటీవీ, డాల్ఫీన్ హోటల్స్ మరియు మార్గదర్శి వంటి వాటిని అమ్మలేడు కాబట్టి అందుకోసమే ఫిలిం సిటీని అమ్ముతున్నారని అంతేకాకుండా ఫిలిం సిటీ గత నాలుగు నెలలుగా తీవ్ర నష్టాల్లో ఉండడం వల్లే రామోజీరావు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు ఇక సోషల్ మీడియాలో ప్రచారం ఈ విధంగా ఉంటె…

తాజాగా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఈ విషయం పై స్పందించి ఈ సంస్థ అమ్మేయడం లో ఏ మాత్రం నిజం లేదని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అయితే ముంబైలో కరోనా విపరీతంగా ఉన్నందున అక్కడ షూటింగులు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో అక్కడి జీ సంస్థ, సోనీ గ్రూప్స్ మరియు ఇతర సినిమా, సీరియల్ షూటింగులకోసం వాళ్ళు వస్తే రామోజీ సంస్థ ఆహ్వానించిందే తప్ప ఫిలిం సిటీని అమ్మలేదని క్లారిటీ ఇచ్చింది. అస్సలు లీజు కు ఇవ్వడం, పూర్తిగా అమ్మేసుకునే విషయం పూర్తిగా అవాస్తం అని వివరించారు. మొత్తానికి సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారానికి తెర పడింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here