Ramesh Babu: ర‌మేష్ బాబు బ్యాడ్ ల‌క్.. అర్జున్ వ‌ల‌న రూ. 150 కోట్ల న‌ష్టం

Ramesh Babu: సినిమా ఇండ‌స్ట్రీలో బండ్లు ఓడ‌లు, ఓడ‌లు బండ్లు కావ‌డం స‌హ‌జం. చాలా మంది నిర్మాత‌లు కొన్ని సినిమాల వ‌ల‌న చేతులు కాల్చుకున్నారు. నటవారసులుగా వచ్చిన వాళ్లు కూడా నిలదొక్కుకోవడం అంత వీజీ ఏం కాదు. సక్సెస్ ఇక్కడ ప్రతిదీ నిర్ణయిస్తుంది. పరిశ్రమ అగ్ర హీరో వారసులే డక్కా మొక్కీలు తింటున్నారు ఇక్కడ. కేవలం 5శాతం సక్సెస్ రేటు ఉండే పరిశ్రమలో ఎవరిని అదృష్టం వరిస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది.

Ramesh Babu lost 150 Crores with Arjun Movie
Ramesh Babu lost 150 Crores with Arjun Movie

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా రంగ ప్రవేశం చేసిన రమేష్ బాబు తనను హీరోగా నిలబెట్టేందుకు కృష్ణ లాంటి శిఖరం అండగా నిలిచినా కానీ అతడు ఎందుకనో హీరోగా రాణించలేకపోయాడు. పరిశ్రమ అగ్ర దర్శకులు దాసరి,జంధ్యాల,కోదండ రామిరెడ్డి వంటి వారి అండదండలు ఉన్నా కానీ రమేష్ బాబు చొరవగా ముందుకు దూసుకెళ్లలేకపోయారు. ఇక కెరీర్ ప్లానింగ్ పరంగానూ కొంత తడబాటు అతడి కెరీర్ ని విశ్లేషిస్తే స్పష్ఠంగా కనిపిస్తుంది.

న‌టుడిగానే కాదు, నిర్మాత‌గా కూడా త‌న‌ది ల‌క్కీ హ్యాండ్ కాదు. అర్జున్‌, అతిథి చిత్రాల‌కు తానే నిర్మాత‌. హిందీలో సూర్య‌వంశ్ కూడా తీశారు. అంతే కాదు.. ఆగ‌డు కి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. అర్జున్ యావ‌రేజ్ గా ఆడింది. అయితే ఆర్థికంగా న‌ష్టాల్ని మూట‌గ‌ట్టుకోవాల్సివ‌చ్చింది. అతిథి కూడా ఫ్లాపే. సూర్య‌వంశ్ తో న‌ష్టాలొచ్చాయి. ఆగ‌డు కూడా ఫ్లాపే. ఎలా చూసినా.. త‌న‌కు పెద్ద దెబ్బ‌లే.

అర్జున్ తో అయితే రూ.150 కోట్లు పోయాయ‌ని ఆయ‌న చెప్పుకుంటారు. అర్జున్ స‌మ‌యంలో, ఆ సినిమా న‌ష్టాల్ని పూడ్చుకోవ‌డానికి ఆయ‌న హైద‌రాబాద్ లోని ఓ స్థ‌లం అమ్మేశారు. అప్ప‌ట్లో ఆ స్థ‌లం ఖ‌రీదు 15 కోట్లు. కానీ.. కాల‌క్ర‌మంలో ఆ స్థ‌లం విలువ‌ రూ.150 కోట్ల‌కు చేరింద‌ట‌. ఆ స్థ‌లాన్ని చూసిన‌ప్పుడల్లా `అర్జున్ వ‌ల్ల నాకు రూ.150 కోట్లు లాస్‌` అని స‌న్నిహితుల‌తో చెప్పుకునేవార‌ని… తెలుస్తోంది.

Ramesh Babu lost 150 Crores with Arjun Movie
Ramesh Babu lost 150 Crores with Arjun Movie

రమేష్ బాబుకు 15 ఏళ్ల వయసులో నీడ చిత్రంతో హీరో అయ్యారు. ఈ మూవీకి దాసరి దర్శకత్వం వహించారు. బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. వంద రోజుల వేడుకలో కరుణానిధి చేతుల మీదుగా జ్ఞాపిక అందుకున్నారు రమేష్ బాబు. కానీ ఆ తర్వాత ఆర్టిస్టుగా ఎనిమిదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. చెన్నై లయోలా కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసి చదివేప్పుడు గ్యాప్ దొరికితే నటనలో శిక్షణ తీసుకున్నారు. తండ్రి నటించే చిత్రాల షూటింగ్స్ కు వెళ్లి నటనను పరిశీలించేవారు. అటుపై చదువులు పూర్తి చేసి తిరిగి హీరోగా కెరీర్ ని సాగించారు.