Ramesh Babu: కృష్ణ కుమారుడు మృతి.. క‌డ‌సారి చూపుకు మ‌హేష్ నోచుకుంటాడా..!

Ramesh Babu: సూప‌ర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ర‌మేష్ బాబు(56) కొద్ది సేప‌టి క్రితం అనారోగ్యంతో క‌న్నుమూసారు. కొంత‌కాలంగా లివ‌ర్ సంబంధిత స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించే స‌మ‌యంలోనే క‌న్నుమూసినట్టు స‌మాచారం. 1965 అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరాలకు మొదటి సంతానంగా జన్మించారు ఘట్టమనేని రమేష్ బాబు.

Ramesh Babu Final Rites, Mahesh Not Attend
Ramesh Babu Final Rites, Mahesh Not Attend

బాల నటుడిగా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో బాల నటుడుగా పరిచయం అయిన రమేష్ బాబు. ఆ తర్వాత కృష్ణ నటించిన పలు సినిమాల్లో హీరో చిన్ననాటి వేశాల్లో నటించాడు రమేష్ బాబు. ముఖ్యంగా ‘మనుషులు చేసిన దొంగలు’, ‘దొంగలకు దొంగ,’ ‘అన్నాదమ్ముల సవాల్’ వంటి చిత్రాల్లో చిన్పప్పటి హీరో పాత్రల్లో నటించాడు రమేష్ బాబు

దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’, ‘పాలు నీళ్లు’ చిత్రాల్లో నటించిన రమేష్ బాబు.. వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్’తో హీరోగా పరిచయం అయ్యారు. తొలి చిత్రం ‘సామ్రాట్’తో మంచి విజయాన్ని అందుకున్న రమేష్ బాబు. ఆ తర్వాత ఈయన ‘చిన్ని కృష్ణుడు’, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్’ ‘ముగ్గురు కొడుకులు’, కృష్ణ గారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, ఆయుధం వంటి పలు చిత్రాల్లో న‌టించారు..

Ramesh Babu Final Rites, Mahesh Not Attend
Ramesh Babu Final Rites, Mahesh Not Attend

1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో ఎన్‌కౌంటర్’ చిత్రంలో చివరసారిగా కనిపించారు. ఆ తర్వాత రమేష్ బాబు ఏ చిత్రంలో నటించలేదు. హీరోగా కెరీర్ ముగిసాక.. మహేష్ బాబు హీరోగా కృష్ణ ప్రొడక్షన్స్ హౌస్ స్థాపించి.. ‘అర్జున్’ ‘అతిథి’ చిత్రాలను తెరకెక్కించాడు. అంతేకాదు ‘దూకుడు’ ‘ఆగడు’వంటి చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించాడు.

తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలియుగ కర్ణుడు’ ముగ్గురు కొడుకులు, ఆయుధం, చిరవగా ‘ఎన్‌కౌంటర్’ చిత్రాల్లో తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు రమేష్ బాబు. తమ్ముడు మహేష్ బాబుతో నిర్మాతగా సినిమాలు నిర్మించడమే కాకుండా.. తమ్ముడుతో కలిసి ‘‘బజారు రౌడీ’, ‘ముగ్గురు కొడుకులు’ చిత్రాల్లో కలిసి నటించాడు . ఆయన మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రిని క‌లిచి వేస్తుంది.

Ramesh Babu Final Rites, Mahesh Not Attend
Ramesh Babu Final Rites, Mahesh Not Attend

అయితే రేపు అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ప్ర‌స్తుతం కోవిడ్‌తో బాధ‌ప‌డుతున్న మ‌హేష్ బాబు త‌న అన్నను క‌డ‌సారి చూపు చూసేందుకు వెళ‌తాడా అనే ప్ర‌శ్న అంద‌రి మ‌దిలో మెదులుతుంది. మూడు రోజుల క్రితం మ‌హేష్‌కి కరోనా సోక‌గా, ఆయ‌న ఈ విష‌యం తెలియ‌జేస్తూ క‌రోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కోవిడ్‌ టెస్ట్‌లు చేయించుకొని జాగ్రత్తగా ఉండండి అని పేర్కొంటూ ట్విటర్‌ ద్వారా సూచించారు. అన్న మృతితో తీవ్ర విషాదంలో ఉన్న మ‌హేష్ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకొని చివ‌రి చూపు చూసేందుకు వెళ‌తాడేమోన‌ని ప‌లువురు భావిస్తున్నారు.