పాయల్ కలిసిన వ్యక్తికి కరోనా.. ఈ అమ్మడి గుండెల్లో మొదలైన గుబులు
Samsthi 2210 - October 27, 2020 / 09:41 PM IST

కరోనా మహమ్మారికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఈ మహమ్మారి పంజా విసరడం ఖాయం. తాజాగా కేంద్ర మంత్రి రామ్‌దాస్ అత్వాలేకు కరోనా వైరస్ సంక్రమించింది. గో కరోనా.. గో.. అంటూ తన నినాదంతో సంచలనం రేపిన ఇప్పుడు కరోనా బారిన పడ్డారు. దగ్గు, ఒళ్ళు నొప్పులు రావడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా అందులో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో 60 ఏళ్ళ రామ్‌దాస్ అత్వాలే ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన అత్వాలే ఆదివారం జరిగిన ఓ ఈవెంట్‌లో నటి పాయల్ ఘోష్‌ను తన పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెను ఆర్‌పీఐ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఇద్దరు కొంచెం దగ్గరగానే మసులు కోవడంతో ఈ అమ్మడి గుండెల్లో భయం మొదలైంది. అథవాలే నుండి తనకి ఏమైన సోకి ఉంటుందా అని భయపడుతుందట. అంతేకాదు ఎలాంటి లక్షణాలు లేకపోయిన కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్ళిందట. పాయల్ ఘోష్ కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేశాడనే ఆరోపణలతో వార్తలలోకి ఎక్కిన సంగతి తెలిసిందే.
తనని లైంగికంగా వేధించిన అనురాగ్ కశ్యప్‌కు కఠిన శిక్ష పడేలా చూడాలని పాయల్ ఘోష్ సెప్టెంబర్ 29 న మహారాష్ట్ర గవర్నర్ బి.ఎస్. కోష్యారిని కలిశారు. ఈ సమయంలో రామ్‌దాస్ అథవాలే ఆమె వెంట ఉన్నారు. అనంతరం వీరిద్దరు కలిసి ముంబై పోలీస్ జాయింట్ కమిషనర్ వీఎన్ పాటిల్‌తో భేటీ అయ్యారు. పాయల్ ఫిర్యాదు ఆధారంగా 376, 354, 341, 342 సెక్షన్లతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పాయల్ ఆర్పీఐ (ఏ) లోకి రావడానికి కారణం ఇది బాబా సాహెబ్ అంబేడ్కర్ పార్టీ అని. ఇది అన్ని వర్గాల వారికి సాయ పడుతుందని ఆమెకు చెప్పానంటూ రామ్‌దాస్ అథవాలే అన్నారు