Ramcharan Tej : కొరియోగ్రాఫర్‌కి రామ్ చరణ్ చేసిన పెద్ద సాయమేంటో తెలుసా.?

NQ Staff - September 22, 2022 / 04:29 PM IST

160096Ramcharan Tej : కొరియోగ్రాఫర్‌కి రామ్ చరణ్ చేసిన పెద్ద సాయమేంటో తెలుసా.?

Ramcharan Tej : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని దేవుడిగా అభివర్ణిస్తుంటాడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. రామ్ చరణ్ విషయంలోనూ అదే అభిమానాన్ని ప్రదర్శిస్తుంటాడాయన. చరణ్ – జానీ మాస్టర్ కాంబినేషన్‌లో పలు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయ్. రామ్ చరణ్‌ది తండ్రిలాగనే, బాబాయ్ లాగానే చాలా పెద్ద మనసు అని పలు సందర్భాల్లో జానీ మాస్టర్ చెప్పిన విషయం విదితమే.

తాజాగా, సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది ఓ డాన్స్ ప్రోగ్రామ్ నుంచి తీసిన వీడియో బైట్. అంందులో జానీ మాస్టర్ జీవితంలోని ఓ ముఖ్యమైన సందర్భాన్ని తీసుకున్నారు.

జానీ మాస్టర్ భార్యకి ఖర్చు లేకుండా వైద్యం చేయించిన చరణ్..

Ramcharan Tej Wife Upasana Saved Johnny Master wife

Ramcharan Tej Wife Upasana Saved Johnny Master wife

జానీ మాస్టర్ భార్య నిండు గర్భిణిగా అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, చరణ్ సాయం కోరాడాయన. అప్పటికి చరణ్ మౌనవ్రతంలో వున్నాడట. మేనేజర్‌కి విషయం చెప్పి, చరణ్‌కి సమాచారం అందాలని జానీ మాస్టర్ కోరాడట.

చరణ్ మౌనవ్రతంలో వున్నాడు గనుక, విషయం ముందుకు కదలదని జానీ మాస్టర్ అనుకున్నా, అక్కడ జరగాల్సిన పనులు జరిగి పోయాయ్. జానీ మాస్టర్ సతీమణికి సర్జరీ జరిగింది. ఆమెకు ప్రాణాపాయం తప్పింది. బిల్లు కట్టే అవసరం లేదంటూ ఆసుపత్రి సిబ్బంది జానీ మాస్టర్‌కి సూచించారు వైద్యులు.

విషయమేంటంటే, అప్పటికే చరణ్ సతీమణి ఉపాసన బిల్లు మొత్తం క్లియర్ చేసేశారు. చరణ్ ఏ పరిస్థితుల్లో వున్నా, సాయం కోసం వచ్చేవారికి అందాల్సిన సాయం విషయంలో ఏమాత్రం ఆలస్యం చెయ్యడని ఈ సంఘటన నిరూపిస్తోంది.