Ramcharan: మోడీ, సచిన్ చేతుల మీదుగా రామ్ చరణ్ కు సత్కారం
NQ Staff - March 15, 2023 / 06:50 PM IST

Ramcharan : దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు గర్వించే విధంగా ఆర్ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు సినిమాకు దక్కిన గొప్ప గౌరవంగా దీన్ని భావించవచ్చు.
ఇటీవల అమెరికాలో జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొన్న రామ్ చరణ్ అతి త్వరలో ఢిల్లీలో జరగబోతున్న ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ హాజరు కాబోతున్నారు.
నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు సొంతం అయిన నేపథ్యంలో రామ్ చరణ్ కి మోడీ మరియు సచిన్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. 17, 18 వ తేదీల్లో జరగబోతున్న ఈ కార్యక్రమం మెగా అభిమానులకు చాలా ప్రత్యేకంగా నిలవబోతోంది.
ఇదే సమయంలో నందమూరి అభిమానులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ని వదిలేసి రామ్ చరణ్ ఒక్కడినే సన్మానించడమేంటంటూ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు.