Ramcharan And Upasana : ఎక్కడకు వెళ్లినా నేను, నా భార్య దేవుడికి పూజలు చేస్తాం.. రామ్ చరణ్‌ దైవ భక్తి..!

NQ Staff - March 16, 2023 / 10:51 AM IST

Ramcharan And Upasana : ఎక్కడకు వెళ్లినా నేను, నా భార్య దేవుడికి పూజలు చేస్తాం.. రామ్ చరణ్‌ దైవ భక్తి..!

Ramcharan And Upasana : రామ్ చరణ్‌ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఆస్కార్ దెబ్బతో ఆయన ఇమేజ్ అమాంతం డబుల్ అయిపోయింది. మొన్నటి వరకు ఆయన్ను అంతా పాన్ ఇండియా స్టార్ అనేవారు. కానీ ఇప్పుడు త్రిబుల్ ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు రావడంతో రామ్ చరణ్‌ ను గ్లోబల్‌ స్టార్ అని పిలుస్తున్నారు. అయితే రామ్ చరణ్‌ మొదటి నుంచి ఓ విషయంలో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే దైవభక్తి విషయంలో మాత్రం కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పటికే ఆయన అయ్యప్ప స్వామి మాలలో ఉంటూ హిందూత్వాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇప్పుడు మరో విషయాన్ని తెలిపారు. రీసెంట్ గా ఆయన ఆస్కార్ వేడుక కోసం యూఎస్ వెళ్లిన సంగతి తెలిసింది.

ఆమెతో కలిసి..

భార్య ఉపాసనతో కలిసి ఆయన ఈవెంట్ కు హాజరయ్యారు. అయితే ఆయన ఈవెంట్ కు వెళ్లే ముందు భార్యతో కలిసి శ్రీరాముడికి పూజలు చేశారు. అది కూడా తమ గదిలోనే చిన్నగా రాముడి మందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. దానిపై రామ్ చరణ్‌ ఇలా స్పందించారు.

నేను, నా భార్య ఎక్కడకు వెళ్లినా సరే చిన్న ఆలయాన్ని నిర్మించుకుంటాం. అది మాకు ఎనర్జీ ఇస్తుంది. అంతే కాకుండా ఇండియాతో కనెక్ట్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్‌. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎక్కడకు వెళ్లినా మన సంస్కృతిని రామ్ చరణ్‌ చాటి చెప్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us