Allu Aravind: అల్లూ వారి రామాయ‌ణం.. రాముడు, సీత పాత్ర‌ల‌లో ఎవ‌రెవ‌రంటే!

Allu Aravind టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇఫ్పుడు బాలీవుడ్ లో కూడా తన పాగా సెట్ చేస్తున్నారు. రామాయణం 3 డి సినిమాని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పుణ్య పురుషుడు శ్రీరాముడిగా హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకునే నటించనున్నారనే సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఫ్రాంచైజ్ ని రన్ చేయనున్నారని ప్రచారం. ఈ సిరీస్ సినిమాలకు దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం లాంటి ఇతిహాస పవిత్రతను కాపాడుతూ.. కథను తెరకెక్కిస్తున్నట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమా కోసం ప్రముఖ రచయితలు కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. మునుపెన్నడూ రాని విధంగా రామాయణాన్ని తీర్చి దిద్దాలనేది అసలైన సంకల్పం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఫాంటమ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో మధు మంతెన డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం 3డి ని తెరకెక్కించడంలో.. అల్లు అరవింద్ తరపున ఫుల్ సపోర్ట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. రామాయణం లాంటి పవిత్ర గ్రంధంలోని ఏ ముఖ్యమైన అంశాన్ని వదలకుండా సుదీర్ఘ కథాంశంతో ఈ సినిమాల్ని తెరకెక్కించనున్నారు. అయితే ఈ రామాయణం 3డి సినిమాని రెండు భాగాలుగా.. విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తెరకెక్కించే ఈ సినిమాని అద్భుతమనిపించే కథతో.. రీవిజనిస్ట్ స్క్రీన్ ప్లే తో రూపొందిస్తున్నారు.

రామాయణం ఇతిహాస పవిత్రతను కాపాడటానికి ఎంతోమంది పరిశోధకులని నియమించి మరీ ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించడం మరింత ఆశక్తికరంగా మారింది. హృతిక్ రోషన్, దీపికా లాంటి స్టార్స్ ని ఖరారు చేశారు. మామ్ సినిమాని డైరెక్ట్ చేసిన రవి ఉద్యోవర్ ఈ ఇతిహాస కథకు స్క్రిప్ట్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడాల్సిందే.

Advertisement