HERO RAM: సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన రామ్.. షాక్‌లో అభిమానులు!

HERO RAM కుర్ర హీరో రామ్ “స్రవంతి” రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కొడుకు అన్న సంగ‌తి తెలిసిందే. హైదరాబాదులో పుట్టినా తన విద్యాభ్యాసం తమిళనాడులో చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమం, సెంట్ జాన్ పాఠశాలలో చేసాడు. సినిమా ప‌రిశ్ర‌మ‌పై మ‌క్కువ‌తో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్.. దేవ‌దాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇక రామ్ న‌టించిన జ‌గ‌డం, రెడీ, కందిరీగ‌, నేను శైల‌జ‌,ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ వంటి చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించ‌డంతో అభిమాన‌గ‌ణం భారీగానే పెరిగింది. ఇక 2019లో పూరీ జ‌గన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇస్మార్ట్ శంక‌ర్ అనే చిత్రాన్ని రామ్ చేయ‌గా, ఈ సినిమాతో రామ్ అంద‌రి దృష్టి ఆక‌ర్షించాడు.

ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో ప‌క్కా మాస్ క్యారెక్ట‌ర్‌లో జీవించిన రామ్ ప‌ర్‌ఫార్మెన్స్‌తోను అద‌ర‌గొట్టాడు. ఈ చిత్రం రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రెడ్ అనే సినిమా చేశాడు. ఇస్టార్మ్ శంక‌ర్ వంటి భారీ హిట్ త‌ర్వాత రామ్ చేసిన రెడ్ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే రెడ్ మూవీ పెద్ద‌గా అంచ‌నాలు అందుకోలేక‌పోయిన ప‌ర్వాలేద‌నిపించింది. ఇక రామ్ త‌ర్వాతి చిత్రాన్ని త్రివిక్ర‌మ్ చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు రాగా, ఈ సినిమా కోసం రామ్ కొన్నాళ్ళు వేచి చూడ‌క త‌ప్ప‌దు. అందుకు కార‌ణం ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్.. ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి సన్నాహాలు చేసుకుంటుండ‌గా, ఈ చిత్రం పూర్తయ్యేస‌రికి ఈ ఏడాది పూర్త‌వుతుంద‌ని తెలుస్తుంది.

త్రివిక్ర‌మ్‌తో సినిమాకు కాస్త టైం పట్ట‌నుండ‌గా, ఈ లోపు కాస్త ఆధ్యాత్మిక‌త‌ను పెంపొదించుకోవాల‌ని శివ మాల వేసుకున్నారు. ఒంటి నిండా నామాలు ధ‌రించి క‌ళ్ళ‌కు జోడ్లు త‌గిలించి స్టైలిష్ లుక్‌లో మెరిసారు. శివ మాల‌లోను మీరు అదిరిపోయార‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం రామ్ న్యూ లుక్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. కాగా, రామ్ శివ మాలని ధ‌రించారు కాబ‌ట్టి 41 రోజుల పాటు నియ‌మ నిబంధ‌న‌లు పాటిస్తూ స్వామిని ఆరాధించాల్సి ఉంటుంది. దీంతో సినిమాల‌కు షార్ట్ బ్రేక్ ఇచ్చిన‌ట్టు రామ్ త‌న సోష‌ల్ మీడియాలో పేర్కొన్నారు.

Advertisement