Ram Lakshman Masters: గాడిద రక్తం తాగుతామ‌ని చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన‌ రామ్ ల‌క్ష్మ‌ణ్‌

Ram Lakshman Masters: టాలీవుడ్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా సేవ‌లు చేస్తూ వ‌స్తున్నారు రామ్ ల‌క్ష్మ‌ణ్‌. ఫైట్ మాస్ట‌ర్స్‌గా పెద్ద హీరోల సినిమా నుండి చిన్న హీరోల సినిమాల వ‌ర‌కు ప‌ని చేశారు. ఫైట్ కంపోజింగ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త విధానాలను అవ‌లంభిస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌స్తున్న రామ్ ల‌క్ష్మ‌ణ్‌లు తాజాగా క్రాక్ సినిమాలోని ఫైట్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. దర్శకుడు చెప్పే కథలో నుంచే కొత్తదనం పుట్టుకొస్తుందని.. అలా వచ్చిందే క్రాక్ సినిమాలోని గాడిద రక్తం ఫైట్ అని అంటున్నారు.

ram lakshman masters
ram lakshman masters

మారిన ప‌రిస్థితులు, ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు అనుగుణంగా టాలీవుడ్ నెంబర్ 1 ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు ఫైట్స్ కంపోజ్‌లో అనేక మార్పులు చేస్తున్నారు. క్రాక్ సినిమా ఫైట్స్‌కి మంచి పేరు రావడంతో పాటు ఆ సినిమాలోని బీచ్ ఫైట్ అంత బాగా వచ్చిందంటే.. అందులో తమ పర్సనల్ అనుభవాలు ఉండటం వల్లే అని అంటున్నారు.

భ‌ర‌త్ అనే నేను సినిమాలో సీఎం ష‌ర్ట్ న‌ల‌గ‌కుండా ఫైట్ చేయాలి అనుకున్నాం. మాములు వ్య‌క్తిలా కింద‌పైన దొర్లి ఫైట్ చేస్తే ర‌క్తి క‌ట్ట‌దు. ఆడియన్స్ కూడా ఇలాంటి వాటిని కోరుకోరు. కథ డిమాండ్ చేస్తే హీరోని కూడా కొట్టిస్తాం.. రంగస్థలం సినిమాలో హీరోని కొట్టించాం.. నేచురల్‌గానే వెళ్తున్నాం. ఇక క్రాక్ విష‌యానికి వ‌స్తే ఒక బీచ్ పక్కన ఉండే ఒక మూర్ఖపు బ్యాచ్‌ని ఎంత క్రూరంగా చూపించాలో అంత క్రూరంగా చూపించాం.

ఈ ఫైట్ అద్భుతంగా రావ‌డానికి ప్రేర‌ణ ఉంది. చీరాలలో మేం కూడా గాడిద రక్తం తాగి పరుగుపెట్టేవాళ్లం. ఫైటర్స్‌గా ఉన్నప్పుడు గాడిద రక్తం తాగేవాళ్లం. ఇంటికి మంచిద‌ని గాడిద రక్తం తాగుతుంటారు. చీరాలలో స్టువర్ట్ పురం అనే ఒక ఏరియా ఉండేది.. ఆ ఏరియాలో ఎక్కువగా దొంగతనాలు జరిగేవి.ఆ దొంగ‌ల‌ని పోలీసులు భీబ‌త్సంగా కొట్టేవారు.అందుకోసం దొంగ‌లు గాడిద ర‌క్తం తాగి, స‌మురు రాసుకొని ప‌రిగెత్తే వారు.

గాడిద రక్తం తాగితే పోలీసులు కొట్టిన దెబ్బల వల్ల వచ్చే నొప్పులు పోతాయట‌. అలా వాళ్లు మళ్లీ ఒకటి రెండు నెలల్లో మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టేవారు. మాకు కూడా గాడిద ర‌క్తంతో అనుభ‌వం ఉంద‌ని రామ్ ల‌క్ష్మ‌ణ్ అన్నారు. ప్ర‌స్తుతం వీరు టాలీవుడ్‌లో బ‌డా ప్రాజెక్టుల‌కు ప‌ని చేస్తున్నారు.