Ram Gopal Varma : ఓ తాత గారూ.. మీరింకా బతికున్నారా.. వీహెచ్ పై ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్..!
NQ Staff - March 19, 2023 / 06:39 PM IST

Ram Gopal Varma : వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో చెప్పడం చాలా కష్టం. ఆయన చేసే కామెంట్లు ఎప్పటికప్పుడు దుమారం రేపుతూనే ఉంటాయి. ఇక రీసెంట్ గా ఆయన నాగార్జున యూనివర్సిటీలో చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. రీసెంట్ గా ఆ యూనివర్సిటీ ప్రోగ్రామ్ కు ఆర్జీవీ వెళ్లారు.
అక్కడ ఆయన మాట్లాడుతూ.. బతికి ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి.. ఇక్కడే అమ్మాయిలతో టైమ్ పాస్ చేయండి.. కొత్త వైరల్ వచ్చి మగజాతి మొత్తం పోతే అప్పుడు ఆడవారికి నేనే దిక్కవుతా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఆర్జీవీ ట్వీట్…
ఆయన చేసిన కామెంట్లు సబబు కాదని,టాడా యాక్ట్ కింద ఆర్జీవీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాగే వదిలేస్తే మహిళలను అవమానించే సంప్రదాయం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. కాగా ఆయన వ్యాఖ్యలపై తాజాగా ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఓ తాత మీరింకా ఉన్నారా..
NASA యాక్ట్ వర్తించదు TADA యాక్ట్ ని 1995 లోనే తీసేశారు. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్‌కి ఆ గతి.. ఒక సారి డాక్టర్ కి చూపించుకొండి’’ అంటూ ట్వీట్ చేశారు. దాంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆర్జీవీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఇంకా డెప్త్ గా చేశాడంటున్నారు ఆయన ఫ్యాన్స్.