Ram Gopal Varma : ఆర్జీవీ వల్లే నాకు ఆస్కార్ వచ్చింది.. కీరవాణి సంచలన కామెంట్లు..!
NQ Staff - March 26, 2023 / 04:15 PM IST

Ram Gopal Varma : కీరవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రీసెంట్ గా ఆయన మ్యూజిక్ అందించిన నాటు నాటు సాంగ్ కు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. దాంతో గ్లోబల్ మొత్తం ఆయన పేరు మార్మోగిపోతోంది. వందల సినిమాలకు ఆయన మ్యూజిక్ అందించారు. ఇక రాజమౌళి తీసే ప్రతి సినిమాకు ఆయనే మ్యూజిక్ అందిస్తారు.
అయితే ఆస్కార్ వచ్చిన తర్వాత ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్జీవీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాకు నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ వచ్చింది. కానీ అంతకు ముందే నాకు ఆర్జీవీ రూపంలో ఒక ఆస్కార్ అవార్డు వచ్చింది. నాకు సినిమాల్లో ఛాన్సులు వచ్చింది ఆర్జీవీ వల్లే.
మూడు సినిమాలు చేసినా..
ఆయన తీసిన క్షణక్షణం మూవీతో మొదటి హిట్ అందుకున్నాను. అంతకు ముందే నేను మూడు సినిమాలు చేసినా నాకు గుర్తింపు రాలేదు. కానీ క్షణక్షణం వల్లే నాకు గుర్తంపు వచ్చింది. ఆయన నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చాడు. అప్పటి నుంచే ఆఫర్లు వచ్చాయి అంటూ తెలిపాడు కీరవాణి.
అయితే కీరవాణి చేసిన కామెంట్లపై ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించాడు. కీరవాణి గారు నాకు చనిపోయిన ఫీలింగ్ వస్తోంది. ఎందుకంటే చనిపోయిన వారినే ఇలా పొగుడుతారు అంటూ చెప్పాడు. దాంతో ఇప్పుడు ఆర్జీవీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్జీవీ వల్ల ఎంతో మంది ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్నారంటూ గుర్తు చేస్తున్నారు.
Hey @mmkeeravaani I am feeling dead because only dead people are praised like this ??? pic.twitter.com/u8c9X8kKQk
— Ram Gopal Varma (@RGVzoomin) March 25, 2023