Ram Gopal Varma : సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడానికి కారణం అదే.. ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్లు..!
NQ Staff - March 6, 2023 / 12:50 PM IST

Ram Gopal Varma : ఆర్జీవీ ఎప్పుడు ఏ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడో చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు లెజెండరీ డైరెక్టర్ అనిపించుకున్న ఆయన.. ఇప్పుడు కేవలం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయిన డైరెక్టర్ గా మాత్రమే మిగిలిపోయాడు. అందుకే ఆయన్ను అంతా కాంట్రవర్సీ డైరెక్టర్ గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాంట్రవర్సీలను మాత్రమే వెతుక్కునే పనిలో బిజీగా ఉంటున్నారు.
ఇక సమాజంలో జరిగే అన్ని విషయాలపై ఎప్పటికప్పుడు స్పందించే వర్మ.. తాజాగా సెలబ్రిటీల విడాకులపై కూడా తన మాటలను బయట పెట్టేశాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయనకు ఇందులో పెండ్లి, విడాకుల గురించి ఓ ప్రశ్న వేశారు. దాంతో ఆర్జీవీ దీనిపై తన పురాణాన్ని బయట పెట్టేశాడు.
లవ్ కిల్లర్ లాంటిదే..
పెండ్లి చేసుకున్న సెలబ్రిటీలు విడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మెయిన్ గా చెప్పుకోవాల్సినవి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ , నాలెడ్జ్ రీజన్స్. ఇవి ప్రధానంగా కారణాలుగా ఉంటున్నాయి. మ్యారేజ్ అనేది ఒక లవ్ కిల్లర్ లాంటిది. అప్పట్లో అమ్మాయిలకు పెద్దగా నాలెడ్జ్ ఉండేది కాదు.
అందుకే పెండ్లి చేసుకున్న భర్తతోనే కలిసి మెలిసి ఉండేవారు. తన తలరాత ఇంతే అనుకుంటూ బతికేవారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారి పోయాయి. ఎవరికి వారే స్వతంత్రంగా బతుకు తున్నారు. ఇంకా చెప్పాలంటే కలిసి ఉంటే సుఖం లేదు. నేను అందుకే విడిపోయాను. విడిపోయాను కాబట్టే ఇంత హ్యాపీగా ఉన్నాను అంటూ తెలిపాడు ఆర్జీవీ.