Ram Gopal Varma: యువ హీరోపై ఆర్జీవి ప్ర‌శంస‌లు.. గ‌త 20 ఏళ్ల‌లోఇలాంటి హీరో చూడ‌లేద‌ని కామెంట్

Ram Gopal Varma: తెలుగు సినిమా స్థాయిని పెంచిన ద‌ర్శ‌కులలో రామ్ గోపాల్ వ‌ర్మ త‌ప్ప‌క ఉంటారు. తెలుగు సినిమాను స‌రికొత్త పంథాలోకి తీసుకు వ‌చ్చ‌న ఆర్జీవి త‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు తెర‌కెక్కించారు. నాగార్జున నుండి అమితాబ్ బ‌చ్చ‌న్ వ‌ర‌కు ఆర్జీవి ఎంతో మంది స్టార్స్‌తో క‌లిసి ప‌ని చేశాడు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్ట‌ర్స్ అంద‌రు వ‌ర్మ శిష్యులే.అయితే గ‌తంలో మాదిరిగా త‌న సినిమాల‌తో అలరించ‌క‌పోయిన మాట‌ల‌తో మాత్రం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు.

ram gopal varma
ram gopal varma

ఇప్పుడు ఆర్జీవి అంటే కాంట్ర‌వ‌ర్సీలుకు కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. ఏ విష‌యాన్నైన మొహ‌మాటం లేకుండా చెప్పేస్తున్నాడు. సినిమాలపై సినిమా స్టార్ లపై ట్విట్టర్ వేదిక‌గా రామ్ గోపాల్ వ‌ర్మ చేసే కామెంట్స్ ఒక్కోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే వ‌ర్మ దాదాపు విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ఎక్కువ‌. పొగ‌డ‌డం చాలా త‌క్కువ‌. కాని తాజాగా ఆయ‌న యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

ఆర్జీవి తాజాగా ట్విట్టర్ వేదికగా విజయ్ దేవరకొండ గురించి చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. గత ఇరవై ఏళ్ళ నుండి “లైగర్” లో కనిపించబోతున్న విజయ్ దేవరకొండ లాంటి హీరోని ఇప్పటివరకు చూడలేదని అన్నారు. అలానే ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న పూరి జగన్నాథ్ కి సినిమా నిర్మాతలో ఒకరైన ఛార్మికి ఇలాంటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నందుకు ధన్యవాదములు అంటూ ట్వీట్ చేశాడు.

రీసెంట్‌గా లైగ‌ర్ సినిమాలోని కొన్ని స‌న్నివేశాలు చూసాన‌ని చెప్పిన ఆర్జీవి తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ఇలాంటి కామెంట్స్ చేయ‌డంతో రౌడీ బాయ్ ఫ్యాన్స్ ఆనంద‌నికి అవ‌ధులు లేకుండా పోయాయి. అంతేకాదు ఆర్జీవి కామెంట్స్‌తో లైగ‌ర్ సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కావ‌ల‌సిన ఈ సినిమా క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది.

వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ఈ సినిమా చాలా ప్ర‌తిష్టాత్మ‌కం కావాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా లైగ‌ర్ చిత్రం రూపొందుతుండ‌గా, ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు అన్ని తిర‌గ‌రాయాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లైగ‌ర్ పోస్ట‌ర్ రిలీజ్ స‌మ‌యంలో అభిమానులు ఎంత హ‌డావిడి చేశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఈ సినిమా కోసం చాలా ఆస‌క్తిగా అంద‌రు ఎదురు చూస్తున్నారు.