Ram Gopal Varma : ఆడాళ్లందరికీ నేను దిక్కవుతా.. దుమారం రేపుతున్న ఆర్జీవీ కామెంట్లు..!

NQ Staff - March 16, 2023 / 01:10 PM IST

Ram Gopal Varma : ఆడాళ్లందరికీ నేను దిక్కవుతా.. దుమారం రేపుతున్న ఆర్జీవీ కామెంట్లు..!

Ram Gopal Varma : మనుషులందు ఆర్జీవీ వేరు అన్నట్టు ఆయన ప్రవర్తిస్తున్నారు. ఆర్జీవీకి కాంట్రవర్సీ డైరెక్టర్ గానే పేరు వస్తోంది. ఈ నడుమ ఎక్కడకు వెళ్లినా సరే ఆయన దారుణంగా మాట్లాడుతున్నారు. ఇక తాజాగా ఆయన మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. తాజాగా ఆయన మార్చి 15న గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషనల్ వేడుకలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మైక్ దొరికింది కదా అని రెచ్చిపోయాడు ఆర్జీవీ. స్టూడెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. మీకు నచ్చింది తినండి, తాగండి లైఫ్‌ ను ఎంజాయ్ చేయండి. పక్కోడితో మనకు సంబంధం లేదు. ఎందుకంటే చచ్చిన తర్వాత స్వర్గంలో ఇవన్నీ లేకపోతే ఎందుకు బాధపడాలి.

ఉచిత సలహాలు..

అందుకే ఇక్కడే మనం ఎంజాయ్ చేయాలి. పైగా స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక లేకపోతే బాధపడుతా నేను. అందుకే ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా నచ్చినట్టు తిరగండి నో ప్రాబ్లమ్. అమ్మాయిలతో తిరిగితేనే మోక్షం భిస్తుందని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నాడు ఆర్జీవీ.

అంతే కాకుండా కొత్త వైరస్ వచ్చి మగజాతి మొత్తం అంతరించి పోవాలని.. అప్పుడు ఆడాళ్లందరికీ తానే దిక్కు అవుతానంటూ దుమారం రేపే కామెంట్లు చేశాడు ఆర్జీవీ. ఆయన మాటలకు అక్కడున్న వారంతా షాక్ అయిపోయారు. అయితే వీసీ మాత్రం ఆర్జీవీ మాటలను తాను కూడా సమర్థిస్తున్నా అంటూ చెబుతూనే.. ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ చెప్పడం కొసమెరుపు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us