Ram Gopal Varma : జయసుధను ఆర్జీవీ ప్రేమించాడని మీకు తెలుసా.. పెండ్లికి అడ్డుపడిందెవరు..?
NQ Staff - April 6, 2023 / 12:20 PM IST

Ram Gopal Varma : ఆర్జీవీ అంటే ఇప్పుడు తెలియని ప్రేక్షకులు లేరు. ఆయన ఇంటర్వ్యూలు ఎంతగా వైరల్ అవుతాయో అందరికీ బాగా తెలుసు. అయితే వర్మ ఇప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు గానీ.. ఒకప్పుడు మాత్రం ఆయన చాలా పెద్ద డైరెక్టర్. అయితే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఓ స్టార్ హీరోయిన్ ను ప్రేమించారంట.
ఆమె ఎవరో కాదు హీరోయిన్ జయసుధ. వర్మ తరణిరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆ సమయంలోనే రావుగారిల్లు అనే సినిమా తెరకెక్కుతోంది. అప్పుడు అందులో హీరోయిన్ జయసుధను చూసిన వర్మ తెగ ఇంప్రెస్ అయిపోయారంట. ఒక రకంగా చెప్పాలంటే ఆమె ప్రేమలో పడిపోయాడంట.
అప్పటికే జయసుధకు పెండ్లి అయింది. ఆ విషయం వర్మకు కూడా తెలుసు. కానీ ఎలాగైనా తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పాలనుకున్నాడు వర్మ. అయితే తరణిరావు ఓ సీన్ రాసి జయసుధకు చెప్పమని అన్నాడు. దాంతో వర్మ ఆ పనిలో నిమగ్నం అయిపోయాడు.
తన ట్యాలెంట్ మొత్తం ఉపయోగించి తెల్లవార్లు ఆలోచించి ఓ సీన్ రాసుకుని జయసుధ వద్దకు వెళ్లాడు. ఆ పేజీ తీసుకున్న ఆమె ఎన్ని పేజీలు అని అడిగింది. దాంతో వర్మ ప్లాన్ మొత్తం అప్సెట్ అయింది. జయసుధ కనీసం ఆ సీన్ ను చూడకుండానే వర్మను పక్కన పెట్టేసింది.
దాంతో జయసుధను ఇంప్రెస్ చేయాలనే వర్మ ఆలోచన ఫెయిల్ అయిపోయింది. అదీ కాక ఓ సారి నేరుగా సీన్ చూపించేందుకు జయసుధ ఇంటికి వెళ్లాడంట వర్మ. అక్కడ తరణిరావుతో జయసుధ అనుబంధం చూసిన తర్వాత ఆమె మీద ప్రేమను చంపుకున్నాడంట.