Ram Gopal Varma: రామ్ గోపాల్ వ‌ర్మ కొండాపై క్రేజీ అప్‌డేట్‌..!

Ram Gopal Varma: సంచ‌న‌ల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసిన కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం. గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ గ్రౌండ్ లో రక్తచరిత్ర రెండు పార్టులుగా తెరకెక్కించిన వర్మ‌.. ఇప్పుడు తెలంగాణ రక్తచరిత్రను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈమేరకు ‘కొండా’ పేరుతో ఓ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్ రావు, సురేఖ దంపతుల జీవితాన్ని ఆర్జీవీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు.

Ram Gopal Varma KONDA movie Official Announcement
Ram Gopal Varma KONDA movie Official Announcement

కొండా దంప‌తుల‌ రెబలిజం గురించి తెలియనిది కాదు. ఇప్పుడు వీరి కథని సినిమా గా మార్చడానికి రాంగోపాల్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. ఆర్‌కె అలియాస్‌ రామకృష్ణ పాత్రలు కీలకంగా ఆయన ఈ సినిమాను రూపొందించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ వరంగల్‌ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు వర్మ తెలిపారు. కొండ మురళి చదువుకున్న కాలేజీలు, కొండా సురేఖ తో అతని పెళ్లి ఎలా జరిగింది, ఆ తర్వాత వారు రాజకీయాల్లో ఎలా ఎదిగారు అనే విషయాలు ఈ సినిమా ద్వారా చూపించనున్నారు వర్మ.

కొండా మురళిపై చాలానే ఆరోపణలు ఉన్నాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడిగా ఉండే మురళి ఆయనకు ఎదురు తిరిగి ఆయనకు పోటీగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రోత్సహించారు. ఆ తర్వాత పరోక్ష రాజకీయాలు చూసుకున్నా కొండ మురళి వైఎస్ చనిపోయిన తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. అక్కడ వారిని సరిగా పట్టించుకోవడం లేదు అని చెప్పిన కొండా మురళి ఆపై కాంగ్రెస్ లో చేరారు. వారి క‌థ‌ను వ‌ర్మ ఎలా తెర‌కెక్కించ‌నున్నాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

కొండా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన స‌మ‌యంలో త‌న వాయిస్‌తో వీడియో విడుద‌ల చేసిన వ‌ర్మ‌.. ‘తెలంగాణ సాయుధ పోరాటం గురించి మొన్నమొన్నటివరకు కూడా ఏమీ తెలియదు. ఈ మధ్య కో ఇన్సిడెంటల్ గా నేను కలిసిన కొంతమంది మాజీ నక్సలైట్లు, ఇంకొంతమంది అప్పటి పోలీస్ ఆఫీసర్ల నుంచి నాకు ఫస్ట్ టైమ్ ఆ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన వచ్చింది.

నేను విన్న విషయాల్లో నన్ను ముఖ్యంగా విపరీతంగా ఆకర్షించింది ఎన్ కౌంటర్ లో చంపేయబడ్డ ఆర్కే అలియాస్ రామకృష్ణకి ఇంకా కొండా మురళికి ఉన్న మహా ప్రత్యేకమైన సంబంధం. ఆ ఎక్స్ట్రాడినరీ బ్యాక్ గ్రౌండ్, అప్పటి పరిస్థితులను సినిమాటిక్ గా క్యాప్చర్ చేయడానికి నేను మురళీ గారిని కూడా కలిసి ఆయన ద్వారా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కోఆపరేట్ చేయమని కోరడం జరిగింది. ఈ సినిమా తీయడం వెనుకున్న నా ఉద్దేశం విని ఆయన కూడా ఒప్పుకున్నారు’. అని వర్మ తెలిపారు.

‘విప్లవం అనేది ఎప్పటికీ ఆగడు. దాని రూపు మార్చుకుంటుంది అంతే. ‘కొండా’ సినిమా చిత్రీకరణ వరంగల్, పరిసర ప్రాంతాల అడవుల్లో జరగనుంది. మా చిత్ర విప్లవం అతి త్వరలో మొదలవబోతుంది’అంటూ వర్మ చెప్పుకొచ్చారు.యోయో టాకీస్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి రానున్న రోజుల‌లో మ‌రిన్ని క్రేజీ అప్‌డేట్స్ ఇవ్వ‌నున్నాడు వ‌ర్మ‌.