Ram Gopal Varma : ఆ హీరోయిన్ తో ఆర్జీవీకి ఎఫైర్.. చూడకూడనిది చూసిన వర్మ..!
NQ Staff - May 24, 2023 / 06:12 PM IST
Ram Gopal Varma : ఆర్జీవీ అంటే ఇప్పుడు కాంట్రవర్సీల్లో ఉన్నాడు కానీ.. ఒకప్పుడు మాత్రం ఆయన సంచలన దర్శకుడు. అప్పట్లోనే ఆయన సంచలన సినిమాలను తీశాడు. ఒకవేళ ఆ సినిమాలను ఆయన పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసి ఉంటే.. మొదటి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యుండేవాడు. అంత గొప్ప సినిమాలను ఆయన తీశారు.
ఇప్పుడు టాప్ డైరెక్టర్లుగా ఉన్న ఎంతోమంది ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర శిష్యులుగా చేసిన వారే. డైరెక్షన్ లో కొత్త దనాన్ని ఊపించాడు ఆర్జీవీ. అలాంటి ఆయన తర్వాత కాలంలో తన ఇమేజ్ ను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కేవలం అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే తీస్తూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటున్నారు.
ఇదిలి ఉండగా తాజాగా ఆర్జీవీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో నాకు ఊర్మిళకు ఎఫైర్ ఉందంటూ ఓ మ్యాగజైన్ వారు వార్త రాశారు. అందులో ఎంత నిజం ఉందో వారికే తెలియాలి. ఆ వార్త చూసిన తర్వాత నేను అమీర్ పేట్ కు రహస్యంగా వెళ్లాను.
అక్కడ చూడకూడనిది ఒకటి చూశాను. ఇలాంటి వార్తలు కొందరు ఫేమస్ కావడానికి రాస్తారు. మరికొందరు మాత్రం డబ్బులు సంపాదించడం కోసం రాస్తుంటారు. అది చూసి నేను నవ్వుకున్నాను. నేను హీరోయిన్లను ఆరాధిస్తాను. అంతే తప్ప ప్రేమించను అంటూ సెటైర్లు వేశాడు ఆర్జీవీ.