Ram Gopal Varma : ఆంజనేయుడికి సీట్ కేటాయించడం చెత్త పని.. ఆర్జీవీ వివాదాస్పద కామెంట్లు..!

NQ Staff - June 17, 2023 / 01:23 PM IST

Ram Gopal Varma : ఆంజనేయుడికి సీట్ కేటాయించడం చెత్త పని.. ఆర్జీవీ వివాదాస్పద కామెంట్లు..!

Ram Gopal Varma : ప్రస్తుతం ఆదిపురుష్ మేనియా నడుస్తోంది. నిన్న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రిలీజ్ అయింది. కాగా ఈ మూవీ ప్రమోషన్లలోనే డైరెక్టర్ ఓం రౌత్ ఓ మాట చెప్పారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు. కాబట్టి ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఓ సీటును కేటాయించండి అంటూ రిక్వెస్ట్ చేశారు.

ఆయన కోరిక మేరకు అందరూ థియేటర్ల యజమానులు ఓ సీటును హనుమంతుడి కోసం కేటాయిస్తున్నారు. మరి ఏ విషయంలో అయినా సరే తన నోటికి పని చెప్పే ఆర్జీవీ.. దీన్ని ఎందుకు వదలాలి అనుకున్నారేమో తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద కామెంట్లు చేశాడు.

హనుమంతుడికి సీటు కేటాయించడం అనేది ఓ చెత్త పని. ఒక రకంగా చెప్పాలంటే అది హనుమంతుడిని అవమానించడమే. హనుమంతుడు కావాలంటే థియేటర్ ను ఎత్తుకెళ్తాడు కదా.. అలాంటి బలవంతుడైన హనుమంతుడికి సీటును కేటాయించడం ఓ స్టుపిడ్ పని అని నాకు అర్థం అయింది.

Ram Gopal Varma Controversial Comments On Not Allotting Seat For Hanuman In Theatres

Ram Gopal Varma Controversial Comments On Not Allotting Seat For Hanuman In Theatres

ఇదంతా కేవలం పబ్లిక్ ను ఓ జోనర్ లోకి తీసుకెళ్లడం కోసమే. సినిమాలో కంటెంట్ ఉంటే ఎవడైనా చూస్తాడు. దానికోసం ఇలాంటి చెత్త ప్రమోషన్లు చేయాల్సిన అవసరం లేదు అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. అయితే కొందరు ఆర్జీవీ కామెంట్లను తప్పుబడుతున్నారు. వారు ఏదో భక్తికొద్ది సీటును వదిలేస్తే దాన్ని కూడా నువ్వు కాంట్రవర్సీ చేయడం అవసరమా అంటూ అడుగుతున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us