Ram Gopal Varma : చంద్ర‌బాబు ఎందుకు ఏడ్చాడో కార‌ణం చెప్పిన ఆర్జీవి..!

Ram Gopal Varma : శుక్ర‌వారం రోజు చంద్ర‌బాబు అసెంబ్లీలోను, ప్రెస్ మీట్‌లోను నానా హంగామా సృష్టించిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ సీఎం అయ్యేవ‌ర‌కు అసెంబ్లీలో అడుగు పెట్ట‌న‌ని శ‌ప‌థం చేశాడు. అయితే బాబు తాను రూపొందించిన‌ “ప‌వ‌ర్ స్టార్‌ ఆర్జీవీ మిస్సింగ్” ట్రైల‌ర్ చూసే ఏడ్చేశాడంటున్నాడు ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Ram Gopal Varma Comments on CBN emotional press meet
Ram Gopal Varma Comments on CBN emotional press meet

అవ‌కాశాన్ని త‌న‌వైపుకు తిప్పుకోవ‌డంలో వర్మ‌ని మించిన వారు లేరు. తాజా పరిణామాలను తనకు అనువుగా మార్చేసుకుంటూ వెళ్లడం ఈ వివాదాస్పద దర్శకుడి నైజం. ఎవరేమనుకున్నా తాను చెప్పాలనుకున్న విషయాన్ని డేర్‌గా అందరిముందు పెట్టే ఆయన, ఏకంగా చంద్రబాబు కంటతడిని తన సినిమా ప్రమోషన్‌గా మార్చేసుకొని చంద్రబాబు ఏడుపుకు కారణం తన సినిమా ట్రైలర్ అని చెబుతూ సరికొత్తగా సెన్సేషన్ క్రియేట్ చేశారు.

Ram Gopal Varma Comments on CBN emotional press meet
Ram Gopal Varma Comments on CBN emotional press meet

ఈ మేర‌కు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ చంద్రబాబు కంటతడి పెట్టుకోవడానికి కారణం తన సినిమా ‘ఆర్జీవీ మిస్సింగ్’ ట్రైలర్ అని చెప్పారు. అంతేకాదు ఈ రియాక్షన్ ఇచ్చినందుకు బాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పారు వర్మ. ఇక ఆర్జీవీ షేర్ చేసిన ఆ వీడియో చూస్తే.. చంద్ర‌బాబు ఏడుస్తున్న క్లిప్‌ను క‌ట్ చేసి మిమిక్రీ వాయిస్‌లో బాబు మాటల్లోనే చెప్పుకొచ్చాడు.

‘ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైల‌ర్ చూడ‌టం జ‌రిగింది. ఇది ఏ విధంగా అభివ‌ర్ణించాలో నాకేతై అర్థం కావ‌డం లేదు’ అని చెప్పడం, ఆ తర్వాత చంద్ర‌బాబు కన్నీళ్లు పెట్టుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనుకావడం చూడొచ్చు. ఇది చూసిన నెటిజన్స్ తమ తమ ఫీలింగ్స్ కామెంట్ల రూపంలో బయటపెడుతున్నారు.