Chandra Babu Naidu : చంద్ర‌బాబుని చూస్తే జాలి కాదు, జుగుప్స పుడుతుందని వ‌ర్మ కామెంట్

Chandra Babu Naidu : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏ విష‌యాన్నైన త‌నకు అనుకూలంగా మ‌ల‌చ‌డంలో ఎక్స్‌ప‌ర్ట్‌. ఏపీ అసెంబ్లీలో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు బోరున ఏడ్చేసిన విష‌యాన్ని కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకొని ర‌చ్చ చేస్తున్నాడు వ‌ర్మ‌. దీనిపై వ‌రుస ట్వీట్స్ చేస్తూ వార్త‌ల‌లోకి ఎక్కుతున్నారు.

Ram Gopal Varma about Chandra Babu Naidu
Ram Gopal Varma about Chandra Babu Naidu

ఏడ్చే మగవాణ్ణి.. నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని పూర్వీకులు చెప్పారని నేను ఎప్పుడో విన్నాను. కానీ, నేను నవ్వే ఆడదాన్ని ఇష్టపడతాను, ఎందుకంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి, కానీ బలం మరియు ధైర్యం చూపించాల్సిన మగాడు పబ్లిక్ లో ఏడిస్తే జాలి కాదు, జుగుప్స పుడుతుందని పేర్కొన్నారు. ఇక, మరో వీడియో ఒకటి తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్టు చేసారు.

చంద్రబాబు తాను రూపొందించిన‌ “ప‌వ‌ర్ స్టార్‌ ఆర్జీవీ మిస్సింగ్” ట్రైల‌ర్ చూసే ఏడ్చేశారంటూ కూడా సైటైర్ వేసారు. చంద్ర‌బాబు ఏడుస్తున్న క్లిప్‌ను క‌ట్ చేసి, ఆయ‌నే మాట్లాడుతున్న‌ట్లుగా ఓ మిమిక్రీ వాయిస్‌ను జ‌త చేశాడు. ‘ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైల‌ర్ చూడ‌టం జ‌రిగింది. ఇది ఏ విధంగా అభివ‌ర్ణించాలో నాకేతై అర్థం కావ‌డం లేదు’ అని చంద్ర‌బాబు చెప్తూ క‌న్నీళ్లు పెట్టుకున్న‌ట్లుగా ఉంది అని వ‌ర్మ అన్నాడు

ఆర్జీవి చేసిన పోస్టు పైన టీడీపీ శ్రేణులు రియాక్ట్ అవుతున్నారు. తన సినిమా ప్రమోషన్ కోసం ఇటువంటివి చేస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక `ఆర్జీవి మిస్సింగ్‌` చిత్రాన్ని భీమవరం టాకీస్‌ పతాకంపై ఛటర్జీ నిర్మిస్తున్నారు. అధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.ఇందులో పవన్ కల్యాణ్‌, చంద్రబాబు నాయుడు, చిరంజీవి వంటి వారి పాత్రలను ఆర్జీవి సెటైరికల్‌గా చూపించారు. గతంలోనూ ఆయన ఆయన పొలిటికల్ గా సెటైరికల్ మూవీలు నిర్మించారు.