Ram Charan: మెగా సిస్టర్స్‌తో రామ్ చరణ్ సందడి.. చక్కర్లు కొడుతున్న ఫొటోలు
Samsthi 2210 - August 29, 2021 / 08:07 PM IST

Ram Charan: మెగా ఫ్యామిలీలో హంగామా మొదలైంది. నిహారిక పెళ్లి తర్వాత మళ్లీ చిరంజీవి బర్త్ డే వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా కనిపించారు. మెగా సందడిన చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు.ఆగస్ట్ 22 చిరంజీవి బర్త్ డే వేడుక, మరోవైపు రాఖీ పండగ వేడుక జరగగా, ఈ రెండు పండుగలని ఫ్యామిలీ అంతా కలిసి జరుపుకుంది.
మెగా వేడుకకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసాయి. రాఖీ పండుగ వేడుక సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు వారి సోదరిమణులు రాఖీలు కట్టారు. మరో వైపు మెగా కజిన్స్ నిహారిక, శ్రీజ, సుష్మిత అందరూ కూడా రామ్ చరణ్, వరుణ్ తేజ్‌లకు రాఖీ కట్టేశారు.
ఇప్పుడు రాఖీ ట్రీట్‌లో భాగంగా మెగా సిస్టర్స్‌తో రామ్ చరణ్ బయటకు వెళ్లాడు. నిహారిక, శ్రీజ, సుస్మితలను వెంట బెట్టుకొని రామ్ చరణ్ ఏదో రెస్టారెంట్‌కి వెళ్లినట్టు తెలుస్తుంది. నాకెంతో ఇష్టమైన వారితో( శ్రీజ, సుష్మిత, రామ్ చరణ్) ఈ మధ్యాహ్నం ఇలా అద్భుతంగా గడిచింది అంటూ నిహారిక అసలు విషయాన్ని చెప్పేశారు. ఈ ఫొటోలలో మెగా సిస్టర్స్, రామ్ చరణ్ మాత్రమే ఉండడంతో రాఖీ ట్రీట్ అనుకుంటున్నారు.
ప్రస్తుతం మెగా సిస్టర్స్‌తో రామ్ చరణ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ చివరిగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాలో కనిపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న చరణ్ మళ్లీ రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన చరణ్ లుక్స్ అలాగే కొన్ని పోస్టర్ లు కూడా మెగా అభిమానుల్లో విపరీతమైన అంచనాలు పెంచాయి. ఎలా అయినా ఈ సినిమాతో రామ్ చరణ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడు అని వాళ్లు భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు చెర్రీ.