Ram Charan : క్యూట్‌ పిక్‌ షేర్ చేసిన ఉపాసన.. చరణ్‌ ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ

NQ Staff - October 6, 2022 / 08:37 AM IST

Ram Charan : క్యూట్‌ పిక్‌ షేర్ చేసిన ఉపాసన.. చరణ్‌ ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల దసరా సందర్భంగా క్యూట్ పిక్ షేర్ చేసింది. అందులో రామ్ చరణ్ తో పాటు అతడి నాయనమ్మ అంజన దేవి కూడా ఉన్నారు. చిరంజీవి మాతృమూర్తి ఆయన అంజనమ్మ తో రామ్ చరణ్ మరియు ఉపాసన తీసుకున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హ్యాపీ దసరా అంటూ ఉపాసన ఈ ఫోటోను షేర్ చేశారు. గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీతో ఉపాసన దూరంగా ఉంటున్నారని పుకార్లు వస్తున్నాయి. ఆ పుకార్లకు ఇది సమాధానం అంటూ మెగా ఫాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వస్తున్న బ్రేక్ వేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ మరియు ఉపాసన ఒక క్యూట్ కపుల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆ క్యూట్ కపుల్ ఇలా బామ్మతో కలిసి ఫోటోకు ఫోజు ఇవ్వడం అందరికీ సర్ప్రైజింగ్ గా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక రాంచరణ్ సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు.

అది ఏడాది పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇక గౌతమ్ తిననూరి దర్శకత్వంలో ఒక సినిమాను ఇప్పటికే రామ్ చరణ్ కన్ఫామ్ చేశాడు. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని సమాచారం అందుతుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us