RRR: ఆర్ఆర్ఆర్ లో రామరాజు పాత్రను లీక్ చేసిన రామ్ చరణ్.. షాక్‌లో టీం!

RRR మెగా వారసుడు రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. దీంతో పాటు తన తండ్రి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య లోనూ సిద్ద అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో 1920 బ్యాక్ డ్రాప్ లో నడిచే ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా అనే విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. చెర్రీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ తో పాటు సెన్సేషనల్ హిట్స్ ఇస్తున్న రాజమౌళి ఈ సినిమాకి దర్శకుడు కావడం మరో హైలెట్. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాపై ఎప్పుడు ఎలాంటి న్యూస్.. అప్డేట్ వస్తుందా అని ప్రేక్షకులు కూడా అదే రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. అయితే రీసెంట్ గా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి అటెండ్ అయిన రామ్ చరణ్ అందులో తన పాత్ర గురించి ఓ విషయం ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తారనే విషయం ఇప్పటికే తెలుసు. కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారు. అయితే భీమ్ ఫర్ రామరాజు వీడియో ప్రోమోలో చరణ్, ఓ పోలీస్ లుక్ లోనూ కనిపిస్తారు. దాని పై అప్పట్లోనే చర్చ జరిగింది. అసలు బ్రిటీష్ వారికి పూర్తిగా వ్యతిరేకి అయిన రామరాజు వారి హయాంలో ఎలా పోలీస్ గా నటిస్తారనే కథనాలు సోషల్ మీడియాలో చాలా స్పీడ్ గా వైరల్ అయ్యాయి.

అయితే లేటెస్ట్ గా జరిగిన పోలీస్ శాఖ వార్షిక క్రీడోత్సవాల కార్యక్రమంలో అటెండ్ అయిన రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర గురించి మాట్లాడుతూ.. ఆర్ ఆర్ఆర్ లో తాను పోలీస్ పాత్రలో కనిపిస్తానని.. తాను పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడాన్ని ఎంతో గౌరవప్రదంగా భావిస్తానని రామ్ చరణ్ తెలిపారు. దీంతో సోషల్ మీడియా వేదికగా రామరాజు పాత్ర బ్రిటీష్ పాలనలో ఎలా పోలీస్ గా ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కథ పూర్తిగా రాజమౌళి రూపొందిస్తున్నది కావడంతో ఇలా జరిగే అవకాశాలున్నాయంటున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే అక్టోబర్ 13 వ తేదిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement