Ram Charan : రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ఉన్న వాచీల ఖ‌రీదు కోట్ల‌లోనే..!

Ram Charan : మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా న‌టుడిగా మార‌నున్న రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టు కూడా నేషనల్ పొలిటికల్ డ్రామా గా ఉండబోతోందని సమాచారం.

Ram Charan watches cost crores
Ram Charan watches cost crores

సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయట. ముఖ్యంగా ఒక ట్రైన్ సీన్ కోసం అయితే దర్శకుడు శంకర్ ఏకంగా పది కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే అంతకు ముందే కేవలం పోస్టర్స్ కోసమే 70 లక్షల వరకు ఖర్చు అయినట్లు సమాచారం. జి స్టూడియోస్ రామ్ చరణ్ 15వ సినిమా రిలీజ్ హక్కులతో పాటు డిజిటల్ శాటిలైట్ హక్కులను కూడా రౌండ్ ఫిగర్ నెంబర్ తో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Ram Charan watches cost crores
Ram Charan watches cost crores

సినిమా మొత్తం దాదాపు 350 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే పట్టు దొరకకపోవడంతో జీ స్టూడియోస్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తాజాగా చ‌ర‌ణ్‌కి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

మెగా వారసుడి దగ్గర 7 అత్యంత ఖరీదైన వాచ్‌లు ఉన్నాయి. ఒక్కొక్కటి కనీసం 10 లక్షల కంటే పైన.. అత్యధికంగా కోటి వరకు ఉన్న వాచ్‌లు కూడా ఈయన దగ్గరున్నాయి. ముఖ్యంగా చేతి వాచీల కలెక్షన్ అంటే రామ్ చరణ్‌కు చాలా యిష్టం. నాగార్జున విదేశాలకు వెళ్తే కాఫీ పౌడర్ కొంటాడు. జూనియర్ ఎన్టీఆర్ అయితే ష్యూస్ ఎక్కువగా తీసుకుంటాడు. అలాగే రామ్ చరణ్‌కు కూడా వాచీలు అంటే చాలా యిష్టం.

రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ప్ర‌స్తుతం 7 వాచిలు ఉండ‌గా, ఒక్కొక్కటి కనీసం 10 లక్షల కంటే పైన.. అత్యధికంగా కోటి వరకు ఉన్న వాచ్‌లు కూడా ఈయన దగ్గరున్నాయి. ప్రపంచంలో ఉన్న టాప్ బ్రాండ్స్ అన్నీ ఈయన దగ్గర ఉన్నాయి. ఏ దేశం వెళ్లినా కూడా రామ్ చరణ్ ముందుగా కొనేది వాచ్. లగ్జరీ వాచ్‌లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా యిష్టపడుతుంటాడు రామ్ చరణ్. తనకు నచ్చిన వాళ్లకు కూడా గడియారాలనే గిప్టులుగా ఇస్తుంటాడు మెగా వారసుడు.