Ram Charan : కాబోయే తల్లి తండ్రులు చరణ్ – ఉపాసన: ఫోటోలు వైరల్.!

NQ Staff - December 27, 2022 / 07:36 PM IST

Ram Charan : కాబోయే తల్లి తండ్రులు చరణ్ – ఉపాసన: ఫోటోలు వైరల్.!

Ram Charan : మెగా ఫ్యామిలీ ఈ ఏడాది ఇయర్ ఎండింగ్ గిఫ్ట్ అందుకున్న సంగతి తెలిసిందే. అదేనండీ, రామ్ చరణ్, ఉపాసన తల్లితండ్రులు కాబోతున్నారన్న గుడ్ న్యూస్ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.

ఈ న్యూస్ వినగానే మెగా ఫ్యాన్స్ సంతోషంతో సంబురాలు చేసుకున్నారు. రామ్ చరణ్, ఉపాసనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.

ఈ సందర్భంగానే తాజాగా రామ్ చరణ్ – ఉపాసన సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసి, తమకు విషెస్ చెప్పిన ఫ్యాన్స్ అందరికీ థాంక్స్ చెప్పారు.

ఇయర్ ఎండింగ్ మెగా గిప్ట్

రామ్ చరణ్ తన ప్రియ సతి ఉపాసనతో పాటూ, ఆయనకెంతో ఇష్టమైన పెట్ డాగ్ కూడా ఈ ఫోటోలో కనిపిస్తోంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
తల్లితండ్రులు కాబోతున్న మాకు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ వుండాలని కోరుకుంటూ మీ రామ్ చరణ్.. అని ఈ ఫోటో పోస్ట్ చేశారు రామ్ చరణ్.

ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్నమూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ డబుల్ రోల్ పోషిస్తున్నారు. అంజలి, కైరా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us