Ram charan teja : ‘‘చాలా చాలా ఇబ్బంది పడ్డాను.. రెండు రోజుల పాటు..’’ రామ్ చరణ్ భార్య ఉపాసన చెప్పిన దారుణ నిజాలు..

Ram charan teja : చిరు ఫ్యామిలీ పెద్ద కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ బెటర్ హాఫ్ ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలపై రెగ్యులర్ గా అప్డేట్లు ఇస్తుంటారు. అపోలో హాస్పిటల్స్ మేనేజ్మెంట్ బాధ్యతలను కూడా మోస్తూ.. వేల సంఖ్యలో పేషెంట్లకు రోగాల్ని నయం చేయిస్తూ.. వాళ్లను హ్యాపీగా ఇంటికి పంపించే ఆమె సైతం రీసెంటుగా కరోనా వైరస్ వల్ల ఎంతో ఇబ్బందిపడ్డారట. రెండు రోజుల పాటు కంటి మీద రెప్ప వాల్చకుండా జాగారం చేశారట.

ఆయన కోసమే..

ఉపాసన రియల్ హీరో రామ్ చరణ్ తేజకి ఇటీవల కొవిడ్-19 వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో చెర్రీ పూర్తిగా హోం క్వారంటైన్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో తన భర్త చాలా ఇబ్బందిపడ్డాడని, ఆయన అలా అనీజీగా ఉండటంతో తనకు కూడా చాలా బాధ కలిగిందని ఉపాసన ఆవేదన వ్యక్తం చేశారు. క్వారంటైన్ టైమ్ లో రామ్ చరణ్ తేజకి కావాల్సినవన్నీ ఆమే దగ్గరుండి చూసుకున్నారు. ఈ నేపథ్యంలో తనకీ కరోనా సోకుతుందేమోనని ఉపాసన క్షణమొక యుగంలా గడిపారు.

హమ్మయ్యా : Ram charan teja

కరోనా ఎటాక్ అయిన భర్త వద్దే ఎక్కువ సేపు గడపటంతో తానూ కొవిడ్-19 బారిన పడతానేమోనని ఉపాసన భయపడ్డారు కానీ.. లక్కీగా ఆమెకు నెగెటివ్ వచ్చింది. దీంతో హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఉపాసనకు ఏ క్షణంలోనైనా కరోనా పాజిటివ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో చేసేదేం లేక ఆమె కూడా హోం క్వారంటైన్ లోనే ఉండిపోయారు. మొదటి రెండు రోజులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Ram-charan-teja-wife-upasana-anxiety
Ram-charan-teja-wife-upasana-anxiety

జయించాం..

మెగా ఫ్యాన్స్ ప్రేమాభిమానాలు, ప్రార్థనలు, పూజలు ఫలించి ఎట్టకేలకు చెర్రీ కొవిడ్-19 మహమ్మారిని జయించాడు. వెంటనే ‘ఆచార్య’ సినిమా షూటింగుకి ‘సిద్ధం’ అంటూ పైనున్న ఫొటోలో మాదిరిగా లొకేషన్ లోకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చాడు. మరో వైపు రాజమౌళి మూవీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణకూ హాజరవుతున్నాడు. దీంతో తన కుటుంబంలో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొన్నాయని ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement