Ram Charan : 100 కోట్ల రెమ్యునరేషన్.! రామ్ చరణ్ సరికొత్త రికార్డ్.!
NQ Staff - January 5, 2023 / 10:26 AM IST

Ram Charan : టాలీవుడ్ హీరోల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేది ఎవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రభాస్ ఒక్కో సినిమాకీ వంద కోట్ల పైనే తీసుకుంటాడన్న ప్రచారం వున్నా, ఆయన సినిమాల్లో భారీతనం తప్ప, రెమ్యునరేషన్ విషయంలో ప్రభాస్ నిర్మాతల ఫ్రెండ్లీ.. అని అంటుంటారు.
ఇక, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయానికొస్తే, రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీయార్ చెరో వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే, నిజానికి వంద కోట్ల లోపే ఆ ఇద్దరి రెమ్యునరేషన్ వుండొచ్చని ఆ తర్వాత తేలింది.
‘పుష్ప ది రూల్’తో అల్లు అర్జున్..
‘పుష్ప ది రూల్’ కోసం మైత్రీ మూవీ మేకర్స్, అల్లు అర్జున్‌కి 100 కోట్లు ఇస్తోందన్నది తాజా ప్రచారం తాలూకు సారాంశం. అయితే, ఈ విషయమ్మీద కూడా భిన్న వాదనలున్నాయి. రెమ్యునరేషన్ సంగతెలా వున్నా, బిజినెస్‌లో అల్లు అర్జున్ వాటా గట్టిగా డిమాండ్ చేస్తున్నాడనీ.. మొత్తంగా 100 కోట్లపైనే బన్నీ ఈ సినిమాతో దండుకోనున్నాడని అంటున్నారు.
తాజాగా రామ్ చరణ్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. సాలిడ్‌గా శంకర్ సినిమా కోసం రామ్ చరణ్ 100 కోట్లు తీసుకుంటున్నాడట. 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్.