Ram charan: ఇన్నాళ్లు సినిమాతో , ఇప్పుడు ఫ్యామిలీతో.. రామ్ చ‌ర‌ణ్ హ్యాపీ మూమెంట్స్

Ram charan: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న డేస్‌ని చ‌క్క‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపిన రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం త‌న ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. రామ్‌చరణ్‌కి స్మాల్‌ బ్రేక్‌ రావడంతో హాలిడే మోడ్‌లో ఉన్నారు. విహారయాత్ర కోసం విదేశాలకు వెళ్లిన చరణ్‌ ఫోటోలను ఆయన భార్య ఉపాసన సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు.

ram charan spending time with family
ram charan spending time with family

ఈ హాలిడే ట్రిప్‌ను కంప్లీట్‌ చేసుకుని వచ్చిన తర్వాత శంకర్‌ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్‌లో రామ్‌చరణ్‌ జాయిన్‌ అవుతారని తెలుస్తోంది. కాగా ఆయన ఓ హీరోగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి హీరోగా చేసిన ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్‌ ఓ కీలక పాత్ర చేశారు.

ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు పూర్తయ్యాయి. కాబట్టి.. ప్రస్తుతం రామ్ చరణ్ .. తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను శంకర్ సరికొత్త కాన్సెప్ట్‌తో తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ పూనేలో కంప్లీట్ అయింది. అటు శంకర్ సినిమా చేస్తూనే.. రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని ‘జెర్సీ’తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నారు.

కార్తితో ‘ఖైదీ’ , విజయ్‌తో ‘మాస్టర్’ సినిమాలతో ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సస్సెన్స్ థ్రిల్లర్ స్టోరీతో చరణ్‌ను ఇంప్రెస్ చేసాడట. త్వరలో ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశాలున్నాయి. మరోవైపు రామ్ చరణ్ వంశీ పైడిపల్లి చెప్పిన కథను ఓకే చేసాడు. ఈ ప్రాజెక్ట్ ఎపుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.

‘ఛలో’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న వెంకీ కుడుములతో నెక్ట్స్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పటికే వెంకీ కుడుముల చెప్పిన కథకు రామ్ చరణ్ ఇంప్రెస్ అయ్యాడట. కానీ ముందుగా ఈయన చిరంజీవితో సినిమా చేసిన తర్వాత రామ్ చరణ్ ప్రాజెక్ట్ టేకప్ చేసే అవకాశాలున్నాయి.

ram charan spending time with family
ram charan spending time with family

అనిల్ రావిపూడి కూడా రామ్ చరణ్‌ ఇమేజ్‌కు తగ్గట్టు ఒక హిల్లేరియస్ స్టోరీ తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నాడు. త్రివిక్రమ్‌తో ఒక సినిమా అనుకుంటున్నాడు. విక్రమ్ కుమార్ తెలుగు తెరపై ఇప్పటి వరకు రానీ డిఫరెంట్ స్టోరీతో రామ్ చరణ్‌ను ఇంప్రెస్ చేసాడట. ఇలా చ‌ర‌ణ్ లైన‌ప్ చూస్తే చాలా పెద్ద‌గానే ఉంది.