Ram charan: ఆర్ఆర్ఆర్ వాయిదాపై రామ్ చ‌ర‌ణ్ ఏమ‌న్నాడంటే…!

Ram charan: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా వాయిదాలు ప‌డుతూనే ఉంది. అంతా బాగుండి ఉంటే చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌య్యేది. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో మూవీ మ‌ళ్లీ వాయిదా ప‌డింది. ఈ చిత్రాన్ని స‌రైన స‌మ‌యంలో విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అయితే చిత్ర హీరో రామ్ చ‌ర‌ణ్ ఓ వేడుక‌లో మూవీ వాయిదాపై స్పందించారు.

ram charan response on rrr postpone
ram charan response on rrr postpone

‘రౌడీ బాయ్స్‌’ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు గెస్ట్‌గా వెళ్ళాడు రామ్ చ‌ర‌ణ్‌. ఇక ఈవెంట్‌లో రామ్‌ చరణ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. మా సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్‌ కాకపోయినా మాకేం బాద లేదు. ఎందుకంటే అలాంటి చిత్రం సరైన సమయంలో రావాలి. ఆ సినిమా కోసం మూడున్నర సంవత్సరాలు చాలా కష్టపడ్డాం. దాని గురించి దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య నిర్ణయిస్తారని పేర్కొన్నాడు.

మాకు సంక్రాంతి ఎంత ముఖ్యమో కాదో మాకు తెలీదు కానీ.. సంక్రాంతి పండుగకి దిల్‌ రాజు గారు మాత్రం చాలా ముఖ్యం. సంక్రాంతి మమ్మల్ని వదులుకోడానికైనా రెడీగా వుంది కానీ దిల్‌ రాజుని వదులుకోడానికి రెడీగా లేదు. ఇలాంటి సక్సస్‌ ఫుల్‌ సంక్రాంతులు ఎన్నో దిల్‌ రాజు చూసాడు. ఈ సంక్రాంతి కూడా ఆయనదే అవ్వాలన్నాడు చెర్రి. ఇక మమ్మల్ని ఆదరించినట్టే ‘రౌడీ బాయ్స్‌’ చిత్ర హీరో ఆశీష్‌ను కూడా ఆశీర్వధించాలని రామ్‌ చరణ్‌ కోరాడు.

రామ్ చరణ్ .. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ డేట్‌లో విడుదలవుతుందో లేదో చూడాలి. కరోనా కేసుల నేపథ్యంలో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ram charan response on rrr postpone
ram charan response on rrr postpone

ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు పూర్తయ్యాయి. కాబట్టి.. ప్రస్తుతం రామ్ చరణ్ .. తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను శంకర్ సరికొత్త కాన్సెప్ట్‌తో తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ పూనేలో కంప్లీట్ అయింది. అయితే..శంకర్ ఈ సినిమాకు కాస్తా గ్యాప్ ఇచ్చి కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ను కంప్లీట్ చేసి మళ్లీ రామ్ చరణ్ సినిమాను టేకప్ చేసే అవకాశాలున్నాయి.