Ram Charan : అమెరికాలో ఇల్లు అద్దెకు తీసుకున్న రామ్ చరణ్.. పెద్ద ప్లానే వేశాడుగా..!
NQ Staff - March 17, 2023 / 10:33 AM IST

Ram Charan : ప్రస్తుతం రామ్ చరణ్ పేరు హాలీవుడ్ స్థాయిలో మార్మోగిపోతోంది. గ్లోబల్ స్టార్ అంటూ ఆయనకు కితాబు ఇస్తున్నారు. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఆయన్ను అంతా గ్లోబల్ స్టార్ అంటూ పిలుస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
పైగా రీసెంట్ గా ఆర్మాక్స్ మీడియా ప్రకటించిన ర్యాంకుల్లో కూడా రామ్ చరణ్ మూడో స్థానంలో నిలబడ్డాడు. అయితే ఆస్కార్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇండియాకు తిరిగి వచ్చేశాడు. కానీ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మాత్రం రాలేదు. వీరిద్దరూ కలిసి ఆస్కార్ ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే.
ఉపాసన కోసమే..
కాగా వీరిద్దరు మాత్రం ఇప్పుడు అమెరికాలోనే ఉండిపోవడానికి ఓ కారణం కూడా ఉంది. అదేంటంటే.. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నారంట. అది కూడా ఉపాసన కోసమే అని తెలుస్తోంది. ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్నారు. అమెరికాలో తనకు అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉంటుందని భావించి కొన్ని నెలల పాటు అక్కడ ఉండాలని భావిస్తున్నారంట.
అందుకే వీరికి సహాయకులుగా ఇండియా నుంచి ముగ్గురు సిబ్బందిని కూడా తీసుకెళ్లారంట. పైగా తమ ఇంట్లో చిన్న దేవుడి గదిని కూడా ఉంచుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా వైరల్ అయ్యాయి.