Ram Charan : నెపోటిజంపై స్పందించిన రామ్ చరణ్.. వాళ్లే తిడుతున్నారు..!
NQ Staff - March 19, 2023 / 06:30 PM IST

Ram Charan : రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ వరకు సాగిపోయింది. ఆస్కార్ అవార్డు రావడంతో ఆయన్ను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా పొగిడేస్తున్నారు. ఆయన ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత నేరుగా చిరంజీవితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ అమిత్ షాతో కలిసి భేటీ అయ్యారు. అనంతరం ఇండియా టుడే కాన్ క్లేవ్ కు హాజరయ్యే అవకాశాన్ని అందుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు నెపోజిజం మీద ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ భిన్నంగా స్పందించారు. నాకు కూడా నెపోటిజం అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఈ మధ్య దాని గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అసలు నెపోటిజం ఉందని భావిస్తున్న వారే దాని గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
ఆయన వల్లే వచ్చాను..
యష్, ఇతర హీరోలు ఎంతో కష్టపడి, ట్యాలెంట్ తోనే పైకి వచ్చారు. నేను మాత్రం నా తండ్రి చిరంజీవి వల్లే ఇండస్ట్రీకి వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి సినిమా పరిశ్రమలోనే పుట్టి పెరిగాను. సినిమాలు చేయాలనే ఆశతోనే ఇండస్ట్రీలో ఉన్నాను. ఇండస్ట్రీకి నేను వచ్చి దాదాపు 14 ఏండ్లు గడుస్తున్నాయి.
వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాను. చిత్ర సీమలో ట్యాలెంట్ మాత్రమే మాట్లాడుతుంది. అది లేకపోతే మనల్ని ఎవరూ గుర్తించరు అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.