Ram Charan: బిగ్ బాస్ వేదికపై రామ్ చ‌ర‌ణ్‌.. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌కి ప్ర‌మోష‌న్‌

Ram Charan: ఇప్పుడు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతుంది. తెలుగులో ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్, నాని, నాగార్జున వంటి సెల‌బ్రిటీలు హోస్ట్‌లుగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం సీజ‌న్ 5కి కూడా నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఈ సీజ‌న్ 5ని మ‌రింత స్పెష‌ల్‌గా మార్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Ram Charan

ఈ క్ర‌మంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిగ్ బాస్ స్టేజ్‌పై అడుగుపెట్టారు.మ్యాస్ట్రో టీం కూడా స్టేజ్‌పై సంద‌డి చేసింది. డిస్నీప్ల‌స్ హాట్ స్టార్‌కి అంబాసిడ‌ర్‌గాఉన్న రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ఇండియాలో కంటెంట్‌కు దిక్సూచిలా డిస్నీ హాట్ స్టార్ నిలుస్తోంది. ఏ క్లాస్ గ్లోబల్‌, ఇండియన్, ప్రాంతీయ భాషల చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తోంది. సినిమాలే కాకుండా వివిధ భాషల్లో వెబ్ సిరీస్‌లను తీసుకొస్తోంది. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లోకి డిస్నీ హాట్ స్టార్ ప్రవేశిస్తుండటంతో టాలీవుడ్‌లోని మేకర్స్, నటులకు అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. తెలుగు వినోద ప్రేమికులను తమ కంటెంట్‌తో డిస్నీ హాట్ స్టార్ అలరిస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించేందుకు, అలరించేందుకు డిస్నీ హాట్ స్టార్ అన్ని రకాలుగా ప్రణాళికలను సిద్దం చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. అంతేకాకుండా వీవో ఐపిఎల్ 2021, ఐసీసీ టీ20 వరల్డ కప్ 2021ను కూడా తెలుగు వారికి అందిస్తోంది. డిస్నీ హాట్ స్టార్ సంస్థ కంటెంట్ హెడ్ సౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఇండియాలోని కంటెంట్‌ను కొత్త పుంతలు తొక్కించేందుకు మేం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాం.

ఇప్పటికే మాస్ట్రో, అనబెల్లె సేతుపతి వంటి చిత్రాలతో ముందుకు వచ్చాం. ప్రస్తుతం ప్రాంతీయ కంటెంట్‌కు ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. గత ఏడాది తమిళంలో అడుగుపెట్టాం. సక్సెస్ సాధించాం. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నాం’ అని అన్నారు.

ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్‌లో నితిన్, నభా నటేష్, తమన్నా నటించిన మాస్ట్రో, విజయ్ సేతుపతి, తాప్సీ కాంబోలో వచ్చిన అనబెల్లె సేతుపతి అందుబాటులో ఉన్నాయి. ఇక అంతే కాకుండా స్వాత్రంత్య్ర‌ సమరానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్‌లో తెరకెక్కించిన అన్ హర్డ్ వెబ్ సిరీస్ కూడా ప్రసారం అవుతోంది. హైద్రాబాద్ స్టేట్ విలీనంపై అప్పటి పరిస్థితుల ఆధారంగా ఆదిత్య కేవీ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను రాధికా లావు, ఎల్లనర్ ఫిల్మ్స్ నిర్మించారు.

ఇక ఇవే కాకుండా రీసెంట్‌గా ఘర్షణ, 9 అవర్స్, ఝాన్సీ వంటి సినిమాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక రియాల్టీ షో అభిమానులను ఆకట్టుకునేందుకు నాగార్జున బిగ్ బాస్ షో కూడా అందుబాటులో ఉంది. ప్రమోష‌న్‌లోభాగంగా బిగ్ బాస్ వేదిక‌పై రామ్ చ‌ర‌ణ్‌, నాగార్జున‌, నితిన్, త‌మ‌న్నా, న‌భా న‌టేష్ బిగ్ బాస్ వేదిక‌పై నేడు సంద‌డి చేయ‌నున్నారు.