Ram Charan : జపాన్ వీధుల్లో రామ్ చరణ్, ఎన్టీయార్.! ‘ఆర్ఆర్ఆర్’ బంధమిది.!
NQ Staff - October 21, 2022 / 09:14 PM IST

Ram Charan : జపాన్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం జపాన్ వెళ్ళింది ‘ఆర్ఆర్ఆర్’ బృందం. రాజమౌళి తన సతీమణి రమ కూడా జపాన్ వెళ్ళారు. చరణ్, ఆయన సతీమణి ఉపాసన, అలాగే ఎన్టీయార్ వెంట ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి జపాన్ వెళ్ళారు.. అక్కడి వీధుల్లో సందడి చేస్తున్నారు.
ఆసక్తికరమైన విషయమేంటంటే, జపాన్లో ‘ఆర్ఆర్ఆర్’ బృందానికి అక్కడి భారతీయులే కాక, జపనీయులు కూడా ఘన స్వాగతం పలుకుతుండడం. స్వాగతం పలకడమేంటి, అభిమానంతో ముంచెత్తేస్తుంటేనూ.!
చరణ్, ఎన్టీయార్.. అలా జపాన్ వీధుల్లో.. సకుటుంబ సమేతంగా…
చరణ్, ఎన్టీయార్.. అలాగే ఉపాసన, లక్ష్మీప్రణతి.. అలా జపాన్ వీధుల్లో సరదాగా తిరుగుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఫరెవర్ లవ్’ అంటూ ఈ వీడియోను రామ్ చరణ్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం కాదు.. నిజానికి, అంతకన్నా ముందే చరణ్, ఎన్టీయార్ చాలా చాలా మంచి స్నేహితులు. ‘బ్రదర్..’ అంటూ చరణ్, ఆప్యాయంగా ఎన్టీయార్ని పిలుస్తాడు. ‘చరణ్ నాకు సోదరుడి కంటే ఎక్కువ..’ అని ఎన్టీయార్, చరణ్ గురించి పేర్కొంటుంటాడు. ఈ ఇద్దర్నీ ఇలా చూసి, యాంటీ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు.