Ram Charan: ప్రేమ‌లో ప‌డ్డ రామ్ చ‌ర‌ణ్‌.. ఉపాస‌న బుంగ‌మూతి..!

Ram Charan: ప్ర‌స్తుతం టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్ లో రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న జంట ఒక‌టి.వీరద్ద‌రు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. జంట‌గా వీరిని చూసిన అభిమానుల ఆనందం అవ‌ధులు దాటుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్.. ఉపాస‌న‌కి పెద్ద షాక్ ఇచ్చాడు.ఆయ‌న వేరే వారితో ల‌వ్‌లో ప‌డ్డాడు. దీంతో ఉపాస‌న బుంగ‌మూతి పెట్టింది.

Ram Charan Latest Poses with His Puppy 'Rhyme'
Ram Charan Latest Poses with His Puppy ‘Rhyme’

అయితే ఇక్క‌డ విష‌యం ఏంటంటే రామ్ చ‌ర‌ణ్ ప్రేమ‌లో ప‌డింది పెట్‌తో . త‌న ఇంటికి కొత్త కుక్క పిల్ల రాగా, దానితో ప్రేమ‌గా ఫొటోలు దిగాడు. దానికి ముద్దులు, హ‌గ్గులు ఇస్తూ పిక్స్ దిగాడు. దానికి రైమ్ అనే పేరును కూడా పెట్టి ప‌ప్పీతో దిగిన ఫొటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోలు చూస్తుంటే చరణ్ ఎక్కడికి వెళ్లినా అది ఆయనను వదిలేలా కన్పించడం లేదు.
Ram Charan Latest Poses with His Puppy 'Rhyme'
Ram Charan Latest Poses with His Puppy ‘Rhyme’

ఏకంగా చరణ్ పైనే ఉంటూ తన ప్రేమను వ్యక్తపరుస్తోంది రైమ్. ఇటీవల కాలంలో సెలెబ్రిటీలంతా మూగజీవాల ప్రేమలో పడిపోయారు. సామ్, రష్మిక, కీర్తి సురేష్ తన కుక్కపిల్లను సోషల్ మీడియాలో ఇప్పటికే పరిచయం చేశారు. ఇక రామ్ చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి చేసిన చ‌ర‌ణ్ ఇందులో అల్లూరిసీతారామారాజు పాత్ర పోషిస్తున్నాడు.
Ram Charan Latest Poses with His Puppy 'Rhyme'
Ram Charan Latest Poses with His Puppy ‘Rhyme’

RC15 అనే వర్కింగ్‍ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలోను న‌టిస్తుండ‌గా, ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుని ఘనంగా ప్రారంభమైంది. ఇక అక్టోబరు నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్‌కు వెళ్లబోతోంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం దాదాపు 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
Ram Charan Latest Poses with His Puppy 'Rhyme'
Ram Charan Latest Poses with His Puppy ‘Rhyme’